Tuesday, April 23, 2024
- Advertisement -

చిరు, ఖుష్బూ డ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో..!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన ఏం చేసిన అది ఓ అద్భుతమే అవుతోంది. అయితే చిరంజీవి అంటే యాక్టింగ్ తో పాటు ఆయన డాన్స్ లను అభిమానులు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. అయితే చిరు డ్యాన్స్ ల్లో ఉన్న గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదని ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో ప్రూవ్ అయింది.

అయితే ఇటీవలే వచ్చిన ’సైరా’ సినిమాలో ఆ డ్యాన్స్ ల జోరు పెద్దగా కనిపించలేదు. ఆ కథ ప్రకారం సినిమాలో డ్యూయెట్స్ కు కానీ, డ్యాన్స్ కు కానీ అంత స్కోప్ లేదు. అయితే ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో మాత్రం చిరు డ్యాన్స్ లు ఓ రేంజ్ లో ఉండనున్నాయని అంటున్నారు. అందుకు ఉదహారణ.. ఇటీవలే చిరు నివాసంలో జరిగిన 80 దశకంలోని హీరో, హీరోయిన్ల రీయూనియన్ అని చెప్పొచ్చు. దక్షణాది సినీ పరిశ్రమకు చెందిన దాదాపు 40 మంది హీరో, హీరోయిన్లు ఈ పార్టీలో పాల్గొన్న విషయం తెలిసిందే.

ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. తాజా అప్పటి హీరోయిన్లతో చిరు చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ‘ఘరానా మొగుడు’ సినిమాలోని ‘బంగారు కోడి పెట్ట’ పాటకి చిరు, కుష్బూ డ్యాన్స్ లతో ఇరక్కొట్టారు ఆ తరువాత జయప్రద, సుహాసిని కూడా జాయిన్ అయ్యారు. ఆ వీడియోని మీరు కూడా చూసేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -