Thursday, March 28, 2024
- Advertisement -

ఆ సినిమా రిమేక్ కి బహుషా ఎవరూ సెట్ కారేమో : చిరంజీవి

- Advertisement -

టాలీవుడ్ లోనే కాదు జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో తన టాలెంట్ చూపిస్తూ తెలుగు సినీ జగత్తులో కొత్తపోకడలు తీసుకు వచ్చారు. డ్యాన్స్, ఫైట్స్, కామెడీ ఏదైనా సరే చిరు ఉంటే ఆ చిత్రం సూపర్ హిట్టే అనే స్థాయికి తీసుకు వచ్చారు. హీరోగా మంచి ఫామ్ లో ఉండగానే రాజకీయాల్లోకి వెళ్లి పదేళ్ల తర్వాత ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత దేశ భక్తి నేపథ్యంలో సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించారు.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా అందాల నటి సమంత హూస్ట్ గా వ్యవహరిస్తున్న సామ్‌జామ్ షోకు అతిథిగా హాజ‌ర‌య్యాడు. డిసెంబ‌ర్ 25న షో ప్ర‌సారం కాగా, ఇందులో మెగాస్టార్ అనేక విష‌యాలు షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మీ హిట్ చిత్రాల రిమేక్ కి ఏ హీరో సెట్ అవుతారు అన్న ప్రశ్నకు.. ఇప్పుడు అందరూ టాలెంటెడ్ హీరోలే అని.. ఎవరి ప్రత్యేకత వారికి ఉందని అన్నారు. ఇక  `ఠాగూర్` సినిమా పవన్ కల్యాణ్‌కి బాగుంటుందన్నారు. `ఇంద్ర` సినిమాకు ప్రభాస్ సూట్ అవుతాడని ,  `ఛాలెంజ్` సినిమాకు బన్నీ లేదా విజయ్ దేవరకొండ అయితే ప‌ర్‌ఫెక్ట్‌గా ఉంటార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

`జగదేక‌వీరుడు.. అతిలోకసుందరి` సినిమాని ‌రామ్‌చరణ్ లేదా మహేష్ బాబు చేస్తే బాగుంటుంది. ఇందులో అతిలోక సుంద‌రిగా స‌మంత మాత్ర‌మే క‌నిపించాలి.  గ్యాంగ్ లీడ‌ర్ మాత్రం చ‌ర‌ణ్ లేదా ఎన్టీఆర్ చేస్తే బాగుంటుంది. రౌడీ అల్లుడుకు ర‌వితేజ లేదా బ‌న్నీ సెట్ అవుతారు. విజేత సినిమాలో నాగ చైత‌న్యని ఊహించుకోవ‌చ్చు.   ‘స్వయంకృషి’  సినిమా మాత్రం ఎవరికీ సెట్ కాదని అభిప్రాయపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -