Saturday, April 27, 2024
- Advertisement -

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ నటుడు

- Advertisement -

శనివారం అర్థరాత్రి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌ తనిఖీల్లో టాలీవుడ్ నటుడు కిరీటి దామరాజు అడ్డంగా బుక్కయ్యారు. జూబ్లీహిల్స్ పరిధిలో నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా నటుడు కిరీటి నడుపుకుంటూ వస్తున్న వాహానాన్ని పోలీసులు ఆపి, తనిఖీ చేశారు. బ్రీత్ ఎనలైజింగ్ పరీక్షల్లో ఆల్కహాల్ లెవల్ 36గా నమోదైంది.

దీంతో ఆయన వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.నటుడు కిరీటి దామరాజు ఉయ్యాలా జంపాలా, సెకండ్ హ్యాండ్, మీకు మీరే మాకు మేమే, ఉన్నది ఒకటే జిందగీ, మెంటల్ మదిలో, చల్ మోహన రంగా తదితర చిత్రాల్లో నటించారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -