Saturday, May 4, 2024
- Advertisement -

‘పుష్ప2’ రష్మిక కీలక సీన్ లీక్ పై క్లారిటీ!

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ” పుష్ప పార్ట్ 2 ” . క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత సంవత్సరం వచ్చిన ” పుష్ప ” మూవీ దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలన విజయం సాధించిదో అందరికీ తెలిసిందే. దాంతో ఎక్కడ కంప్రమైజ్ కాకుండా పుష్ప-2 సినిమాని రూపొందిస్తున్నారు చిత్రయూనిట్.

ప్రస్తుతం ఈ సినిమా టీమ్ రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్స్ సీన్స్‌ను చిత్రీకరిస్తోంది. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన వీడియో కు విశేష స్పందన వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి రష్మిక సీన్స్ కొన్ని లీక్ అయ్యాయని.. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో రష్మిక పాత్ర చనిపోతుందనే వార్త నెట్టింట చర్చ జరుగుతుంది.

అయితే సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతున్న ఫొటో ’ పుష్ప2’ సినిమాలోనుది కాదు… 2022లో రిలీజైన ’నయ్ వరణ్ భట్ లోంచా కోన్ నై కొంచా’ అనే మరాఠి సినిమాలోనిది. ఇందులో హీరోయిన్ ఇషా దనేకర్ రష్మిక కాదు. రష్మికకి ఇషాకి దగ్గర పోలికతో ఉండడంతో, ఆమె క్లోజప్ లో రష్మికలా కనిపించి ఉంటుంది. అసలు నిజం ఇదే తప్పా.. పుష్ప2 నుంచి ఎలాంటి లీకులు, ఎలాంటి ఫోటోలు బయటికి రాలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -