ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ దూరం..

Jr NTR Unable to Attend NTR Centenary Celebrations
Jr NTR Unable to Attend NTR Centenary Celebrations

ఈరోజు హైదరాబాద్‌లో సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగునున్నాయి. ఈ ఉత్సవాలకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఆహ్వానం అందిన విశయం తెలిసిందే. అయితే ఈ ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ వస్తారని ఓ వార్త వైరల్ అయింది. ఇదే విషయం పై ఎన్టీఆర్ పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.

నేడు హైదరాబాద్‌లో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు కార్యక్రమానికి వ్యతిగత కారణల వల్ల జూనియర్ ఎన్టీఆర్ హాజరు కావడం లేదని జూనియర్ ఎన్టీఆర్ పీఆర్ టీమ్ వెల్లడించింది. ఈరోజు తన 40వ జన్మదినోత్స కార్యక్రమాన్ని తన కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్నారు. శతజయంతి ఉత్సవాలు కార్యక్రమానికి ఆహ్వాన సమయంలో ఆర్గనైజింగ్ కమిటీకి ఇదే విషయాన్ని తెలియజేయడం జరిగిందని తెలిపారు.