మళయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ యంగ్ హీరోయిన్గా దూసుకుపోతుంది.అ ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచియమైన అనుపమ, ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోలందరితోను హీరోయిన్గా నటించింది.నాని,నాగచైతన్య,శర్వానంద్,రామ్,నితిన్ ఇలా యువ హీరోలతో కలిసి నటించింది అనుపమ.అలాంటి అనుపమపై ఓ నటుడు కోపంతో ఉన్నాడు.అనుపమ ఉంటే ఆ సినిమాలలో తాను నటించనని దర్శక-నిర్మాతలకు హుకుం జారీ చేస్తున్నాడని సమాచారం.
పూర్తి వివరాలలోకి వెళ్తే..సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్‌కు కాస్త కోపం ఎక్కువనే సంగతి తెలిసిందే. గతంలో ఆయన గొడవ పడిన సందర్భాలు ఉన్నాయి. ప్రకాష్ రాజ్ ప్రవర్తన పట్ల అనుపమ పరమేశ్వరన్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఓ తెలుగు సినిమాలో అనుపమకు తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు.షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య చిన్న గొడవ జరిగిందని టాక్. అది కాస్త సీరియస్ ఇష్యూ అవ్వడంతో ఆయన షూటింగ్ నుండి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. దీంతో వీరిద్దరి మధ్య మాటలు లేవని సమాచారం.అనుమప ఉన్న సినిమాలో తాను నటించనని ప్రకాష్ రాజ్ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.మరి దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
