Saturday, April 20, 2024
- Advertisement -

కలర్ ఫొటో మూవీ రివ్యూ..!

- Advertisement -

దసరా అంటే సినిమా పండగ అంటారు. కానీ ఈ సారి దసరాకు థియేటర్స్ లేకపోవడంతో సినిమాలు రిలీజ్ కాలేదు. అయితే కొత్త సినిమాల కోసం ప్రేక్షకుడు ఓటీటీ వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అందులో భాంగానే ఈ రోజు ఆహా ఓటీటీ‌లో కలర్ ఫోటో సినిమా రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

స్టోరీ : ఇది 1997లో జరిగే కథ. జయకృష్ణ (సుహాస్‌) అబ్బాయి మచిలీపట్నం దగ్గర ఓ గ్రామంలో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. ఓ రోజు తాను చదువుకునే కాలేజీలో కల్చరల్‌ రిహార్సల్స్‌లో భాగంగా దీప్తి వర్మ (చాందినీ చౌదరి) కనిపిస్తోంది. మొదటి చూపులోనే ప్రేమలో పడుతాడు. అయితే తాను నల్లగా ఉండటంతో.. అంత అందంగా ఉన్న అమ్మయి తన ప్రేమను ఒప్పుకుంటుందా అని భయపడి ప్రేమను మనసులో దాచుకుంటాడు. అయితే జయకృష్ణ వ్యక్తిత్వం నచ్చిన దీప్తి అతని ప్రేమిస్తోంది. వీరి ప్రేమ విషయం దీప్తి అన్నయ్య ఇన్‌స్పెక్టర్‌ రామరాజు (సునీల్‌)కు తెలియడంతో వారి ప్రేమకు అడ్డుపడుతాడు. ఆ తర్వాత జయకృష్ణపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది ? వారిద్దరు కలుసుకున్నారా ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

వివరణ : హీరోగా సుహాస్‌కు ఫస్ట్ మూవీ అయినప్పటికి చాలా బాగా నటించాడు. దీప్తి పాత్రలో చాందినీ చౌదరి ఒదిగిపోయింది. సునీల్‌ ప్రతినాయకుడిగా ఆకట్టుకున్నాడు. అయితే విలన్ గా ప్రేక్షకులను భయపెట్టలేకపోయాడు. కాలభైరవ అందించిన పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు ఆకట్టుకున్నాయి. తెలుగులో చాలా లవ్ స్టోరీ వచ్చాయి. కానీ వివక్షను ఆధారంగా చేసుకొని మాత్రం ఎక్కువగా సినిమాలు రాలేదు. అదే పాయింట్ ని తీసుకొని దర్శకుడు సందీప్‌ రాజ్‌ ఈ సినిమాని తెరకెక్కించాడు. అయితే కథనంను నడిపించడంలో మాత్రం దర్శకుడు తడబడ్డాడని చెప్పాలి. సినిమాలో అసలు విషయం విరామంలో మొదలు పెట్టాడు దర్శకుడు. ఇక సెకండాఫ్ లో హీరోయిన్ ప్రేమను ఒప్పుకోవడం.. సాంగ్స్.. ఆ తర్వాత హీరోయిన్ అన్నయ్య ఎంట్రీ.. వీరి ప్రేమకి అడ్డు చెప్పడం ఇలా అన్ని చాలా రోటీన్ గా సాగుతాయి. కాకపోతే ఎమోషనల్ సీన్స్ ని బాగా తెరకెక్కించాడు దర్శకుడు.

బిగ్ బాస్ లో విన్నర్ ఎవరో చెప్పేసిన గంగవ్వ..!

బన్నీ ఫాన్స్ లో ఆందోళన మొదలవుతుందట..

ఎక్కువగా సిగరెట్లు తాగే మహేష్ సడెన్ గా ఎందుకు మానేశాడో తెలుసా ?

బ్రహ్మాజీ పిల్లలను ఎందుకు వద్దనుకున్నాడో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -