Wednesday, May 7, 2025
- Advertisement -

సప్తగిరి కి హ్యాండ్ ఇచ్చి పృధ్వీ ని లేపిన మారుతీ .. కారణం ఏంటో

- Advertisement -

విక్టరీ వెంకటేష్ – మారుతి ల సినిమా 12 ఆగస్ట్ కి ఫిక్స్ అవడం తో ఇప్పుడు తెలుగు సినిమా ట్రేడింగ్ వర్గాలు ఈ సినిమా మీద ద్రుష్టి పెట్టాయి. ఈ సినిమా టాక్ ఎలా ఉండబోతోంది, హై లైట్ పాత్రలు ఏంటి అనే వైపు ఈ ఆసక్తికర చర్చ సాగుతోంది. సాధారణంగా తన సినిమాల్లో సప్తగిరి కి ఎక్కువ పెర్ఫార్మెన్స్ రోల్ ఇచ్చే మారుతి ఈ సినిమాలో అతనికంటే కూడా పృధ్వీ కి ఫుల్ లెంత్ కామెడీ ఇచ్చారు అని చెబుతున్నారు.

బత్తాకాయల బాబ్జిగా థర్టీ ఇయర్స్ ప్రుధ్వి చేస్తున్నాడు. మారుతి మార్క్ కామెడీతో ఈ క్యారక్టర్ డిజైన్ చేశారట. ఇక సినిమాలో ప్రుధ్వి చేసే కామెడీకి కడుపు చెక్కలయ్యేలా నవ్వాల్సిందే అంటున్నారు చిత్రయూనిట్. బ్రహ్మానందం కాస్త వెనక్కి తగ్గే సరికి ఇండస్ట్రీకి ఎప్పుడో వచ్చినా ఈ మధ్య క్లిక్ అయిన థర్టీ ఇయర్స్ ప్రుధ్వి మరోసారి ఈ సినిమాలో రెచ్చిపోనున్నాడట.

ఇక ఈ సినిమా తర్వాత ప్రుధ్వి కోసం దర్శక నిర్మాతలు వెంటబడతారు అంటున్నారు. మొదటి భాగం మొత్తం ప్రుధ్వి తన కామెడీతో అలరించి తర్వాత మాయమవుతాడట. సో బాబు బంగారం సినిమాలో హైలెట్ గా నిలుస్తున్న బత్తాకాయల బాబ్జి ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -