Sunday, April 28, 2024
- Advertisement -

‘మహా సముద్రం’ నుండి బయటకు రాలేకపోతున్న అజయ్ భూపతి

- Advertisement -

‘ఆర్ ఎక్స్ 100’ వంటి కల్ట్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు అజయ్ భూపతి. మొదటి సినిమా బ్లాక్బస్టర్ అవ్వడం తో ఇండస్ట్రీలో అజయ్ పేరు బాగానే వినిపించింది. రామ్, నితిన్ వంటి యువ హీరోలు కూడా అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించారు. కానీ సినిమా విడుదలై సంవత్సరం దాటిపోయింది కానీ తన రెండవ సినిమా కోసం ఒక్క హీరోని కూడా ఒప్పించలేకపోయాడు. అప్పట్లో అక్కినేని కాంపౌండ్లో చేరిన అజయ్ భూపతి స్మగ్లింగ్ చుట్టూ తిరిగే ‘మహా సముద్రం’ అనే కథని సినిమాగా తీయాలని అనుకున్నారు. కానీ నాగచైతన్యని ఈ సినిమాకోసం ఒప్పించలేకపోయాడు.

ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నీ అనుకున్నారు కానీ బెల్లంకొండ కూడా హ్యాండ్ ఇచ్చాడు. తాజాగా కొత్త కథల వెతుకుతున్న రవితేజ ‘మహాసముద్రం’ సినిమాకి ఓకే చెప్పాడు కానీ ఆ సినిమా షూటింగ్ మాత్రం లేట్ చేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో అజయ్ భూపతి ‘చీప్ స్టార్’ అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఎవరిని ఉద్దేశించి ఇలాంటి ట్వీట్ చేశాడు అని సర్వత్రా చర్చ మొదలైంది. మరో వైపు ఎంతమంది హీరోలు ఆ కథని రిజెక్ట్ చేస్తున్నప్పటికీ ‘మహాసముద్రం’ కథ నుంచి దర్శకుడు మాత్రం బయటకు రాలేక పోతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -