Wednesday, May 15, 2024
- Advertisement -

బాబాయ్ హత్యకేసుపై జగన్ సీరియస్…స్వయంగా రంగంలోకి దిగిన డీజీపీ…

- Advertisement -

ఎన్నికలకు ముందు జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. హత్య విషయంలో టీడీపీ , వైసీపీ ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే సిట్ లో ఎటువంటి పురోగతి కనిపించలేదు. ఇంతలో ఎన్నికలు రావడం ఆ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి రావడంతో వివేకా హత్య కేసు ఓకొలిక్కి వస్తుందనుకున్నారు అందరూ. కాని అదేం జరగలేదు.

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసి మూడు నెలల్లో పాలనపై తనదైన ముద్ర వేసిన జగన్ బాబాయ్ హత్య కేసులో మాత్రం తవ్ర అసంతృప్తితో ఉన్నారు.సాక్షాత్తూ ఏపీ సీఎం సొంత బాబాయి మర్డర్ కేసు మిస్టరీ వీడకపోవడం ఆశ్చర్యం కలుగుతోంది. జగన్ సీఎంగా పగ్గాలు చేపట్టి 100 రోజులు అవుతున్నా.. హత్య కేసును పోలీసులు చేధించలేకపోయారు.

వైఎస్ వర్ధంతి సందర్భంగా పులివెందుల వెళ్లిన జగన్.. వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. వివేకానంద రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో.. ఆయన కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కానీ వివేకానంద సతీమణి సౌభాగ్యమ్మ మాత్రం పాల్గొనలేదు.తన భర్తను హత్య చేసింది ఎవరో తేల్చకపోవడంపై ఆమె అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. అందుకే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాలేదని ప్రచారం జరుగుతోంది.

మిస్టరీగా మారిన వివేకా హత్య కేసును గత ఆరు నెలలుగా సిట్ దర్యాప్తు చేస్తోంది. 13వందల మందినిపైగా విచారించి, నలుగురికి నార్కో అనాలసిస్ టెస్ట్ లు చేసినా హంతకులు ఎవరో గుర్తించలేకపోయారు.అయితే ఈ కేసు విచారణ పేరుతో తనను వేధిస్తున్నారంటూ తాజాగా శ్రీనివాసులు రెడ్డి అనే వైసీపీ నేత పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ వ్యవహారంపై సీఎం జగన్ సీరియన్ అయ్యారని చెబుతున్నారు. ఏపీ డీజీపీపై అసహనం వ్యక్తం చేశారు. మీరేం చేస్తారో తెలీదు.. చిన్నాన్న హత్య కేసు మిస్టరీ తేల్చమని ఆదేశించారు. హంతకులు ఎవరైనా ఉపేక్షించొద్దని సీఎం సూచించడంతో స్వయంగా రంగంలోకి డీజీపీ గౌతమ్ సవాంగ్ దిగారు.మంగళవారం రాత్రే ఆయన రోడ్డు మార్గం ద్వారా కడప బయల్దేరి వెళ్లారు.

ఇప్పటి వరకు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలు.. ఎక్కడ క్లిష్టత ఉంది…ఎందుకు హంతకులను గుర్తించలేకపోయారన్న దానిపై డీజీపీ ఆరా తీస్తున్నారని సమాచారం. స్వయంగా డీజీపీ రంగంలోకి దిగడంతో వివేకా కేసు దర్యాప్తు మరింత ముమ్మరం అయ్యినట్టే అని చెబుతున్నారు. దీంతో కేసు త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -