Thursday, April 25, 2024
- Advertisement -

‘చితక్కొట్టుడు 2’ రెడీ అయ్యింది.

- Advertisement -

తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయం సాధించిన అడల్ట్ హారర్ కామెడీ చిత్రం ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ చిత్రానికి సీక్వెల్ గా ‘చితక్కొట్టుడు 2’ రెడీ అయ్యింది.

మొదటి వెర్షన్‌కు దర్శకత్వం వహించిన సంతోష్. పి. జయకుమార్ ఈ రెండో భాగానికి కూడా దర్శకత్వం వహించడమే కాక హీరోగా కూడా నటించారు. ఫ్లైయింగ్ హార్స్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై ఎస్. హ‌రి భాస్కర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న థియేటర్స్ లో విడుదల కానుంది.

ఈ సందర్భంగా దర్శకుడు – కథనాయకుడు సంతోష్. పి. జయకుమార్ మాట్లాడుతూ ” ఇప్పటివరకు వచ్చిన అడల్ట్ హారర్ కామెడీ చిత్రాలకి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. మొదటి వెర్షన్ కి మించిన స్థాయిలో ఈ సీక్వెల్ ఉంటుంది. లాక్ డౌన్ తరువాత దీపావళికి తమిళనాట విడుదలైన తొలి చిత్రం ఇదే. సూపర్ రెస్పాన్స్ వస్తుంది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. కొత్త సంవత్సరంలో ప్రేక్షకులకి కనువిందు చేసే చిత్రం ఇది. ” అని తెలిపారు.

న‌టీన‌టులు: సంతోష్ పి జ‌య‌కుమార్, మీన‌ల్, క‌రీష్మా, ఆకృతి సింగ్, ర‌వి మారియ, ఛామ్స్, డానీ, టీఎస్కే, ష‌ల్లు షాము, లొల్లు ష‌బా మ‌నోహ‌ర్, లొల్లు ష‌బా స్వామీనాథ‌న్, సింగ‌మ్ పులి.

దర్శకుడు: సంతోష్ పి. జయకుమార్
నిర్మాత: ఎస్. హరి భాస్కరన్.
సంగీతం: ఎస్.ఎన్. ప్రసాద్, ధరన్ కుమార్.
సినిమాటోగ్రఫీ: బల్లు
ఎడిటర్: ప్రసన్న జి. కె.
బ్యానర్: ఫ్లైయింగ్ హార్స్ పిక్చర్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -