Friday, May 17, 2024
- Advertisement -

“దర్బార్” మూవీ రివ్యూ

- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా ఏ ఆర్ మురుగదాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం దర్బార్. రజినీ మరియు మురుగదాస్ ల కాంబోలో మొట్టమొదటి సారి తెరకెక్కిన చిత్రం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ రోజే రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

ఆదిత్య అరుణాచలం(రజినీకాంత్) మంచి పోలీస్ ఆఫీసర్. ఇతను ఢిల్లీ నుంచి ముంబైకి ట్రాన్సఫర్ మీదా వస్తాడు. ఈ క్రమంలో విలన్ హరి చోప్రా(సునీల్ శెట్టి) డాన్ గా ఒక మాఫియాను నడిపిస్తుంటాడు. అయితే వీరిద్దరి మధ్య ఉన్న లింక్ ఏంటి ? కథలో నివేథ థామస్ పాత్ర ఏంటి ? కథను హీరో ఎలా ముగించాడు ? అనేది చూడాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ : రజనీ ఎప్పటిలానే తనదైన శైలీలో నటించారు. స్టైల్ గా.. తన డైలాగ్ మాడ్యులేషన్ తో ఫ్యాన్స్ కు మంచి కిక్కిచారు. రజినీ వన్ మేన్ షోతో ఒక స్టైలిష్ మాస్ పోలీస్ ఆఫీసర్ గా ఫ్యాన్స్ పండగ చేసుకునేలా రజినీని దర్శకుడు మురుగదాస్ చూపించారు. అంతే కాకుండా ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎలివేషన్ సీన్స్ కానీ అలాగే అక్కడ స్టార్ కమెడియన్ యోగిబాబు మరియు రజినీల మధ్య కామెడీ ట్రాక్స్ బాగుంటాయి. అలానే రజినీ, నయనతారల మధ్య వచ్చే కెమిస్ట్రీ బాగా కుదిరింది. కథానుసారం వచ్చే ఫైట్స్,ఎమోషనల్ సీన్స్ , రజిని మార్క్ ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి. హీరోయిన్ నయన్ మరియు నివేతల మంచి నటన కనబర్చారు. ఇక విలన్ గా సునీల్ శెట్టి పర్ఫెక్ట్ విలనిజం చూపించారని చెప్పాలి. ఇక మిగిత నటినటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. అనిరుద్ సాంగ్స్ విజువల్ బాగున్నాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ : మురుగదాస్ అంటే కచ్చితంగా కొన్ని ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. ఆయన ఏ సినిమా చేసిన అదిరిపోయే కాన్సెప్ట్ తో వస్తారు. అలానే స్క్రీన్ ప్లేతో మాయ చేస్తారు. కానీ ఈ సినిమాలో అవేవి పెద్దగా లేవు. అయితే ఫస్ట్ హాఫ్ సోసోగా ఉంది అనుకుంటే సెకండాఫ్ లో కూడా అంత కొత్తదనం ఏమి ఉండదు. రెగ్యులర్ కాప్ డ్రామాలానే అనిపిస్తుంది. ఇది కాస్త ఫ్యాన్స్ ను నిరాశ పరిచే అంశమే.

మొత్తంగా : రజనీ, మురుగదాస్ కాంబోలో వచ్చిన ఈ సినిమా రజినీ మార్క్ ఎలివేషన్ సీన్స్ సాగుతోంది. అయితే రొటీన్ కథ మరియు కథనాలు సినిమాపై దెబ్బపడేలా చేశాయి. రొటీన్ స్టోరీతోనే సినిమాని లాక్కొచ్చాడు మురుగదాస్. ఏది ఏమైన రజినీ మాత్రం వన్ మాన్ షో చూపించారు. రజనీ సినిమాలు ఎంజాయ్ చేసేవారికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -