Friday, April 26, 2024
- Advertisement -

సుధీప్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సల్మాన్

- Advertisement -

కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు సుధీప్. ఆయన హీరోగా చేస్తూనే విలన్‌గా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కూడా చేస్తున్నారు. ఈగ మూవీతో ఎంతో పేరు తెచ్చుకున్న ఆయన తాజాగా ఓ బాలీవుడ్ సినిమాల ప్రతినాయక పాత్రలో నటించాడు. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన దబాంగ్‌ 3లో విలన్‌గా నటించాడు సుధీప్‌. ప్రభుదేవా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా గత డిసెంబర్‌లో రిలీజ్‌ అయి విజయం సాధించింది.

చుల్‌పాండే పాత్రలో సల్మాన్ మరోసారి మ్యాజిక్‌ చేయగా విలన్‌గా సుధీప్‌ సూపర్బ్ అనిపించాడు. ఈ సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన సుధీప్‌కు తనదైన స్టైల్‌లో సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు సల్మాన్‌. తనకు నచ్చిన వారికి సర్ ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వడం సల్మాన్ కు అలవాటు. ఇప్పటికే చాలా మందికి గిఫ్ట్ లు ఇచ్చాడు. తాజాగా తన సినిమాలో విలన్ పాత్ర పోషించిన సుధీప్‌కు కూడా ఓ కాస్ట్లీ గిఫ్ట్‌ను అందించాడు. దాదాపు కోటిన్నర ఖరీదు చేసే బీఎండబ్ల్యూ కారును సుధీప్‌కు బహుమతిగా అందించాడు.

అంతేకాదు ఈ కారును స్వయంగా సల్మానే సుధీప్‌ ఇంటికి తీసుకెళ్లి ఇవ్వటం విశేషం. సల్మాన్ తనపై చూపించిన ప్రేమను సుధీప్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ‘మనం మంచి చేస్తే మనకు మంచే జరుగుతుంది. సల్మాన్‌ సార్‌ ఈ గిఫ్ట్‌తో ఈ సూత్రాన్ని మరింతకాలం నమ్మేలా చేశారు. బీఎండబ్ల్యూ ఎం5, స్వీట్‌ గెస్చర్‌. నా మీద నా కుటుంబం మీద చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞడ్ని సార్. మీరు ఇలా మా దగ్గరకి రావటం, మీతో నేను కలిసి నటించటం నాకెంతో గర్వంగా ఉంది` అంటూ సుధీప్ ట్వీట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -