సుకుమార్ రైటింగ్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి.. ‘కుమారి 21 ఎఫ్’ సినిమాని అందించాడు దర్శకుడు సుకుమార్. కొత్త దర్శకుడు హరి ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దర్శకుడు’. ఈ రోజే రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ :
మహేష్ (అశోక్) చిన్నప్పటి నుంచి డైరెక్టర్ అవ్వాలనే ఆశతో.. ఒకసారి ఒక సినిమాకి అవకాశం దక్కించుకుని దాని స్క్రిప్ట్ పనుల్లో ఉంటాడు. అదే టైంలో నమ్రత (ఈషా రెబ్బ) పరిచయమవుతుంది. ఆ పరిచయం లవ్ గా మారుతోంది. కానీ ఆశోక్ మాత్రం తనలో ఉన్న దర్శకుడి వలన ప్రేమను కూడా సినిమా కోణంలోనే చూస్తుంటాడు. దాంతో హార్ట్ అయిన నమ్రత అతనికి దూరంగా వెళ్ళిపోతుంది. అలా ప్రేమను కోల్పోయిన అశోక్ తాను ప్రాణం పెట్టి డైరెక్ట్ చేసిన సినిమాకు కూడా దూరమైపోతాడు. అలా ప్రేమ, సినిమా రెండింటినీ కోల్పోయిన అశోక్ ఎలాంటి బాధ అనుభవించాడు. అసలు సినిమా ఛాన్సు ఎలా మిస్ అయింది.. ఆ తర్వాత ఆమెను ఎలా కలుసుకున్నాడు అనేది మిగిత కథ.
ప్లస్ పాయింట్స్ :
మూవీలో ఎక్కువ భాగం ఆకట్టుకుంది హీరో పాత్ర చిత్రీకరణ. సినిమాని లైఫ్ గా భావించి.. సినిమాలోనే లైఫ్ చూసుకొని.. ఎలా ఆలోచింస్తాడు.. ప్రేమించిన అమ్మాయిని కూడా సినిమా కోణం నుంచే చూస్తూ అన్ని ఎమోషన్స్ ని తన సినిమా కోసం ఎలా వాడుకుంటాడు అనేది బాగా చూపించారు. అలానే సినిమాలో లవ్ ట్రాక్ బాగుంది. హీరోయిన్ ఈషా రెబ్బ బాగా చేసింది. లవ్ ట్రాక్ ను ఆడియన్సుకి కనెక్టయ్యే విధంగా చేసింది. ఇక కథలో కీలకమైన హీరో పాత్రలోని దర్శకుడికి, ప్రేమికుడికి మధ్య నడిచే సంఘర్షణ అవసరామైన అన్ని సందర్భాల్లో కాకపోయినా కొన్ని సన్నివేశాల్లో మాత్రం కనబడింది. ఇంటర్వెల్ సన్నివేశం కొత్తగా స్వార్థపరుడైన దర్శకుడు ఎలా ప్రవర్తిస్తాడు అనే విషయాన్ని బలంగా ఎలివేట్ చేయగలిగింది. అలానే క్లైమాక్స్ లో ఎమోషన్ బాగుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలో ప్రధాన మైనస్ విషయంకు వస్తే దర్శకత్వ లోపమనే చెప్పాలి. దర్శకుడు రాసుకున్న సీన్స్ ను అదే రెంజ్ లో తెరపై చూపించలేకపోయాడని అర్ధం అవుతోంది. అయన ముఖ్యంగా అనుకున్న అంశంను సరిగ్గా చూపించాలేకపోయాడు. దాంతో కథలో ఉన్న సోల్ మిస్సయింది. అలానే సినిమా చివర్లో.. సీన్స్ కూడా అలా అలా లాగించేయడంతో పెద్దగా భావోద్వేగం కలగలేదు. కథ విషయం అలా ఉంటే.. కథలో అసలు బలం లేదు. ఇక హీరో అశోక్ పర్వాలేదనిపించినా బరువైన ఎమోషన్స్ చూపించాల్సిన చోట సరిగ్గా చూపించలేకపోయాడు. అలాగే సినిమా అంటే ఇంతే అంటూ ఫస్టాఫ్, సెకండాఫ్ లలో చాలా సన్నివేశాల్ని రొటీన్ గానే తీశారు. మధ్యలో కామెడీ జనరేట్ చేసే ఛాన్స్ ఉన్నా దర్శకుడు వాడుకోలేకపోయాడు.
మొత్తంగా :
డైరెక్టర్ హరి ప్రసాద్ జక్కా.. కొత్తవారవడం వలన.. సినిమాని పూర్తి స్థాయిలో ఆకట్టుకునే తీయలేకపోయారు. లవ సీన్స్, హీరో నటన, ఈషా రెబ్బ నటన.. చివరి లో కొన్ని సీన్స్ పర్వాలేదు అనిపించగా.. కథ, కథనంలో దమ్ము లేకపోవడం.. భావోద్వేగాల్ని పలికించే సీన్స్ లేకపోవడం, కామెడీ పెద్దగా లేకపోవడం నిరుత్సాహాపరిచే అంశాలు.. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆడియన్స్ దర్శకుడు సినిమాని దర్శించుకోవడం కష్టమే.