Sunday, May 19, 2024
- Advertisement -

దసరా బుల్లోడా..? దీపావళి మొనగాడా…?

- Advertisement -

టాలీవుడ్లో మెగా కాంపౌండ్ కు, అక్కినేని కాంపౌండ్ కు మధ్య మంచి సత్సంబంధాలున్నాయి. వారి లోపల ఏం ఉందో మనకు తెలియదుగాని… ఒకరినొకరు మాత్రం ఎంతో గౌరవించుకుంటారు.

కలిసి యాపారాలు చేస్తారు. లాభాలు ఆర్జిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడో గాని వారి మధ్య చాలా రేర్ గా బాక్సాఫీస్ ఫైట్ జరుగుతూ ఉంటుంది. చిరంజీవి,నాగార్జునలు మంచి ఫామ్ లో ఉన్న టైమ్లో కూడా వారు అంతగా  ఫైట్ చేసుకున్న సందర్భాలు లేవు.కాని వారసులు వచ్చే సరికి ఆ ఫైట్ ను ఆపడం ఎవరి వల్ల కావడం లేదు.వీరిద్దరి వారసులు ఇప్పుడు కయ్యానికి కాలు దువ్వుతున్నారు.

ముందుగా చెర్రీ,అఖిల్ ప్రస్థావన తీసుకుంటే….వీరిలో దసరా కానుకగా చరణ్ బ్రూస్ లీ తో వస్తుంటే…అతనొచ్చిన వారం తరువాత అఖిల్ తన పేరునే టైటిల్ గా పెట్టుకుని మరీ వచ్చేస్తున్నాడు.

సో మొదటి ఫైట్ దసరాకు ఉండబోతోంది.సెకండ్ ఫైట్ విషయానికొస్తే….. నవంబర్ 11న దీపావళికి చరణ్ తమ్ముడు వరుణ్ తేజ్ కు ,అఖిల్ అన్న చైతన్యకు మధ్య  ఉండబోతోంది.కంచెతో వరుణ్ , సాహసం శ్వాసగా సాగిపో తో చైతులు నువ్వా నేనా అని తేల్చుకోబోతున్నారు.

అయితే దసరా,దీపావళి ఫైట్స్ లో రెండు సక్సెస్ లు … ఒకే కాంపౌండ్ కు వస్తాయని జరుగుతోన్న సోషల్ మీడియా ప్రచారాన్ని మనం విశ్వసించలేం. చెరో కాంపౌండ్ కు ఒక హిట్ వస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నారు.

దసరాకు ఓడినవారు దీపావళికి విజయాల వెలుగును చూడటం ఖాయమనుకోవచ్చు. అంటే దసరా బుల్లోడు టైటిల్ ఒకరికి,దీపావళి మొనగాడు టైటిల్ మరొకరికి అన్నమాట.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -