Thursday, May 2, 2024
- Advertisement -

రీ రిలీజ్ అవ్వబోతున్న ‘డియర్ కామ్రేడ్’ సినిమా

- Advertisement -

‘గీత గోవిందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ మరియు రష్మీక మందన్న ఈసారి ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ మధ్యనే విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదల అయినప్పటికీ, ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటోంది. సెకండ్ హాఫ్ బాగా స్లో గా ఉందని, రన్ టైం కూడా బాగా ఎక్కువ ఉందని కొందరు కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం చిత్ర బృందం సినిమా ని రీరిలీజ్ చేయబోతున్నారు.

అయితే కొత్త వెర్షన్ లో 14 నిమిషాల సన్నివేశాలను తొలగించారట. దీంతో సినిమా మరింత క్రిస్ప్ గా మారనుందట. అంతే కాకుండా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందిన కాంటీన్ పాట కూడా ఇప్పుడు సినిమాలో యాడ్ చేసినట్టు సమాచారం. మరి కొత్త వెర్షన్ అయినా సినిమా కలెక్షన్లు పెరగడంతో దోహద పడుతుందో లేదో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -