Monday, May 20, 2024
- Advertisement -

శత్రువుల పై మౌన దాడి చేస్తున్న అల్లు అర్జున్

- Advertisement -

నిన్న మొత్తం సోషల్ మీడియా లో అల్లు అర్జున్ తదుపరి చిత్రం పై ఒక ఆంగ్ల చిత్రం లో వచ్చిన నెగటివిటీ కి సంబందించిన చర్చ జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే అనూహ్యం గా ఇంకా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ వంటివి ఏమి విడుదల కాక ముందే అల్లు అర్జున్ సినిమా ని ప్లాప్ అయిన బ్రహ్మోత్సవం తో కంపేర్ చేయడం ఏంటి అని అందరూ వాపోతున్నారు. అయితే బన్నీ మాత్రం దీని పై సైలెంట్ గా ఉన్నాడు. ముందు నుండి ఈ సినిమా పై నెగటివిటీ పెరుగుతూ వస్తుంది అని గ్రహించిన అల్లు అర్జున్ డామేజ్ కంట్రోల్ చేయడం లో విఫలమయ్యాడు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ పీ ఆర్ టీమ్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఈ నెగటివిటీ కి సంబంధించి ఒక కౌంటర్ అని చెప్పుకోవచ్చు.

అందుకు గానూ బన్నీ కి ఒక కనిపించని శత్రువుల ఆర్మీ ఒకటి తయారు అవుతుంది అనే విషయం అవుతుంది. బన్నీ టీమ్ చేసిన ప్రకటన లో కూడా దీనిని ప్రస్తావించడం విశేషం.

“డియర్ ఇన్విజిబుల్ ఆర్మీ, నెగటివ్ ఆర్టికల్స్ 18 ఏళ్ళ కష్టాన్ని ఒక మంచి స్టార్ ని కిందకి దించలేవు. అతని డెడికేషన్, పక్క వాళ్ళకి సహాయ పడే గుణం ఆయనకి ఫాలోవర్స్ ని తీసుకొని వచ్చింది. చివరికి ఎవరు సంతోషంగా నవ్వుతారు అనేది చూద్దాం. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా చాలా బాగా వస్తుంది. ఆ తర్వాతి రెండు సినిమాల కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ కూడా బాగా జరుగుతుంది.” అని తన టీమ్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -