బాలీవుడ్ ప్రస్తుతం టాప్ హీరోయిన్ ఎవరు అంటే అందరు దీపికా పడుకొనే పేరే చెబుతారు అందరు.తాజాగా ఆమె బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.రణ్‌బీర్ కపూర్,దీపికా గతంలో ప్రేమించుకున్న సంగతి తెలిసిందే.రణ్‌బీర్ కపూర్,దీపికా ఎందుకు విడిపోయారో ఇప్పటికి ఎవరికి తెలియదు.బ్రేకప్ అయిన తరువాత చాలా సార్లు ఆమె రణబీర్ విమర్శలు చేసింది.దీపికా.రణబీర్ తనను మోసం చేశాడని బహిరంగంగానే కామెంట్స్ చేసింది దీపికా.
నాకు సంబంధించిన వరకు సెక్స్ అనేది ఫిజికల్ మాత్రమే కాదు.. భావోద్వేగాలతో కూడిన ఒక ఎమోషన్. నేను రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు నా పార్ట్నర్ ను మోసం చేయలేదు.కానీ నన్ను మోసం చేసే వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉండడంలో అర్ధం లేదనిపించింది. దానికంటే సింగిల్ గా ఉండడం మంచిది అనుకున్నా, అందుకే అతని నుండి దూరంగా వచ్చేశానని తెలిపింది.దీపికాతో విడిపోయిన తరువాత రణ్‌బీర్ సోనమ్ కపూర్, కత్రినా కైఫ్‌లతో డేటింగ్ చేశాడు. ప్రస్తుతం అలియా భట్‌తో డేటింగ్‌లో ఉన్నాడు రణ్‌బీర్.ఇటు దీపికా కూడా బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో ప్రేమలో ఉంది.వీరిద్దరు డిసెంబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం.