బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది దీపిక.ఇక్కడ వరకు బాగానే ఉంది కాని ఆమె వెయించుకున్న టాటూ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.గతంలో దీపిక హీరో రణ్‌బీర్ కపూర్‌తో కొంతకాలం ప్రేమలో ఉంది.వీరిద్దరు కలిసి కొన్నాళ్లు సహజీవనం కూడా చేశారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి.ఏమైందో ఏమో తెలియదు కాని సడన్‌గా వీరిద్దరు విడిపోయారు.వీరిద్దరు విడిపోయిన తరువాత ఒకరి గురించి మరోకరు ఇప్పటి వరకు మాట్లాడలేదు.
రణ్‌బీర్‌తో ప్రేమలో ఉన్నప్పుడు అతని పేరుని తన మెడ మీద టాటూ వేయించుకుంది దీపిక.మాజీ బాయ్‌ఫ్రెండ్ రణ్‌బీర్ పేరు తన పేరు వచ్చేలా టాటూ వేయించుకుంది దీపిక.అయితే బ్రేకప్ అనంతరం ఆ టాటూను తొలగించుకోవడానికి అమ్మడు చాలా ప్రయత్నాలు చేసింది. అయితే ఊహించని విధంగా ఇటీవల అంబానీ వివాహవేడుకల్లో మరోసారి ఆ టాటూ బయటపడింది. దీంతో మీడియాలో మరోసారి ఆమె పాత జ్ఞాపకాలకు సంబందించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయిన ఇప్పుడు పెళ్లి చేసుకున్న రణ్‌వీర్ కపూర్ పేరు కూడా ఆర్‌తోనే మొదలు అవుతుంది.దీంతో దీపిక టాటూని తొలగించలేదని తెలుస్తుంది.అయిన చేసుకున్న వాడికి లేని బాధ,మీడియాకు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
- 2,196 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్‌కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!