మాజీ ప్రియుడు మోసంను బయటపెట్టిన దీపికా పదుకునె..!

- Advertisement -

బాలీవుడ్ లో ప్రేమలు బ్రేకప్ లు చాలా కమన్ అనే విషయం తెలిసిందే. వీరు ఏ టైంలో ప్రేమించుకుంటారో ఏ టైంలో విడిపోతారో తెలియదు. స్టార్ హోదాను మరచిపోయి లాంగ్ డ్రైవ్ లకు వెళ్తూ కెమెరాలకు చిక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం పెళ్లి చేసుకునేందుకు రణ్ బీర్, అలియా రెడీ ఉన్నారు. అయితే రణ్ బీర్ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు.

కొన్నిసార్లు రణ్ బీర్ – అలియా భట్ మధ్య బ్రేకప్ జరిగిందని.. మళ్లీ కలుసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని వీరిద్దరు క్లారిటీ ఇచ్చారు. కొన్నేళ్ల క్రితం దీపికా పదుకొనె, రణ్ బీర్ ల మధ్య డేటింగ్ ఏ రేంజ్ లో కొనసాగిందో అందరికి తెలిసిందే. దీపికా అయితే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. కానీ సడేన్ గా వీరికి బ్రేకప్ జరిగింది. దీపికా తనకు జరిగిన మోసం గురించి చెప్పింది. ఆమె చాలా ఆవేదనకు లోనైనట్లు పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. సెక్స్ అనేది మనసుకు సంబంధించింది.. శరీరానికి సంబంధించింది కాదు అంటూ.. ఒకసారి మోసం చేస్తే పొరపాటు అనుకోవచ్చు, రెండవసారి కూడా అదే పని చేస్తూ దొరికేస్తే.. మనపై అతనికి ఎలాంటి ప్రేమ లేదని అర్థం చేసుకోవచ్చు అని దీపికా పరోక్షంగా రణ్ బీర్ పేరు ప్రస్తావించకుండానే అతను చేసిన మోసం గురించి చెప్పింది.

- Advertisement -

ఇంకోసారి అతనికి మోసం చేసే ఛాన్స్ ఇవ్వాలనుకోలేదు. ఆ తర్వాత ఎన్నో రోజులు చాలా మనోవేదనకు లోనయ్యానని చెప్పింది. ఇక రన్ బీర్ ప్రేమకు బ్రేకప్ చేప్పిన దీపికా ఆ తరువాత రణ్ వీర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక రణ్ బీర్ మాత్రం కొన్నిరోజులు కత్రినాతో రిలేషన్ మెయిన్టైన్ చేసి తర్వాత అలియాతో ప్రేమయాణం కొనసాగిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -