Friday, March 29, 2024
- Advertisement -

గదిలో బంధించి చంపుతా అన్నాడు : ప్రీతి జింటా

- Advertisement -

బాలీవుడ్ నటి ప్రీతిజింటా, ప్రముఖ పారిశ్రామిక వేత్త నెస్ వాడియా మధ్య లవ్ బానే నడిచింది. వీరిద్దరు కలిసి ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టును కొనుగోలు చేసిన తర్వాత వారిద్దరూ డేటింగ్ చేయడం మీడియాలో హాట్ చర్చగా మారింది. అంతబానే ఉందనుకున్న టైంలో వారిద్దరి మధ్య బ్రేకప్ అయిపోయింది. ప్రీతిజింటా, నెస్ వాడియా మధ్య అఫైర్‌కు 2014 మే 30న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన చిచ్చు పెట్టింది. ఆ మ్యాచ్ తర్వాత తన చేయి పట్టుకుని దురుసుగా నైస్ బిహేవ్ చేశాడని.. టీమ్ సభ్యుల ముందు తనపై కోపడింది ప్రీతి.

మా మధ్య అవగాహన లోపించింది. జట్టు మేనేజ్‌మెంట్ విషయంలో మా మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ క్రమంలోనే స్టేడియంలో మా మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో దారుణమైన పదజాలంతో నన్ను తిట్టారు. నెస్ వాడియాను నోరు పారేసుకోవద్దని నేను హెచ్చరించాను. అయితే తన పద్దతి మార్చుకోలేదు. నన్ను మానసికంగా క్షోభకు గురిచేశారు అని ప్రీతి జింటా తెలిపింది. అంతేకాకుండా నెస్ వాడియా తనని మట్టుబెడుతానని బెదిరించడని.. తనను కనిపించకుండా చేస్తానని హెచ్చరించాడని చెప్పింది. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఘటన నా జీవితానికి ముప్పుగా మారింది అని ప్రీతి జింటా వెల్లడించారు.

నెస్ వాడియాతో వివాదం నేపథ్యంలో ముంబై పోలీస్ కమిషనర్‌ రాకేష్ మారియాకు లేఖ రాసి.. తన ప్రాణాలకు ముప్పు ఉంది. ఆయన నాతో చాలా ఉక్రోశం, హింసాత్మకంగా వ్యవహరిస్తున్నారు. సిగరెట్లు కాల్చి నా ముఖంపైన విసిరికొడుతున్నారు. గదిలో బంధించి వేధిస్తున్నారు. నాపై చేయి కూడా చేసుకొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉండటం సరికాదు. కావున నాకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి అంటూ లేఖలో పేర్కొన్నారు. నెస్ వాడియాకు దూరంగా ఉంటే నాకు జీవితంలో మనశాంతి ఉంటుంది. లేకపోతే నా జీవితంలో దుర్దినం చోటుచేసుకొనే ప్రమాదం ఉంది.

నన్ను చంపడానికైనా సిద్ధంగా ఉన్నాడు. నాపై అంతగా కసి పెంచుకొన్నాడు అని ప్రీతి జింటా ఆరోపణలు చేసింది. అయితే తనపై ప్రీతి చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఆమె చెప్పిన మాటల్లో నిజం లేదు అని నెస్ వాడియా ఖండించారు. ఇలాంటి విభేదాలు, శతృత్వం దిశగా దారి తీసిన వారి మధ్య వివాదానికి 2018లో ముగింపు దొరికింది. బాంబై హైకోర్టు సూచన మేరకు కోర్టు బయట వారు తమ వివాదాన్ని పరిష్కరించుకొన్నారు. ఈ వివాదం కొనసాగిన సమయంలోనూ, ప్రస్తుతం కూడా వారిద్దరూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు సహ యజమానులుగా కొనసాగడం కొసమెరుపు కావడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -