బాలీవుడ్‌లో ప్రేమ, పెళ్లిల్లు, సహజీవనాలు ఇవేమి కొత్త కాదు. పెళ్లి చేసుకోకుండానె కూతుర్ని కన్నానని అందులో తప్పేంటని స్టేట్ మెంట్ ఇచ్చింది బాలీవుడ్ హీరోయిన్. 2008లో వచ్చిన సూపర్‌హిట్ సినిమా ‘దేవ్ డీ’లో హీరోయిన్‌గా నటించిన మహీ గిల్ గుర్తుందా? ఆ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి ప్రతిభ గల నటిగా మహీ పేరు తెచ్చుకున్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటివరకు నోరు మెదపని ఈ అమ్మడు.. తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.
తనకు వెరోనికా అనే కూతురు ఉందని… వచ్చే నెలలో తన బిడ్డకు రెండేళ్లు నిండుతాయని చెప్పింది. తాను ఇంత వరకు పెళ్లి చేసుకోలేదని… అయితే రిలేషన్ షిప్ లో ఉన్నానని తెలిపింది. ఒక కూతురుకు తల్లినైనందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది ఈ బాలీవుడ్ బ్యూటీ.పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు చేసుకుంటానని స్టేట్ మెంట్ ఇచ్చింది.
పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించగా.. ‘పెళ్లి అవసరం ఏముంది? ఇదంతా మన ఆలోచనాధోరణిపైనే ఆధారపడి ఉంటుంది. పెళ్లి లేకపోయినా.. పిల్లలు, కుటుంబాన్ని కలిగి ఉండవచ్చు. పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనడంలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది.పెళ్లి కాకుండానే పిల్లల్ని కనడంలో ఎలాంటి సమస్య లేదని చెప్పింది. పెళ్లి చాలా అద్భుతమైనదని… అయితే పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనేది వ్యక్తిగత నిర్ణయమని తెలిపింది.
