Friday, April 19, 2024
- Advertisement -

నాని పైన క్రష్ కాదు ప్రేమ అంటున్న యువ హీరోయిన్

- Advertisement -

దొరసాని అనే చిత్రం తో త్వరలో తెలుగు సినిమా పరిశ్రమ లోకి అడుగు పెడుతున్న నటులు ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్. ఈ ఇద్దరికీ ఫ్యామిలీ బాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ మొదటి సినిమా ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారు అనే విషయం తెలియాల్సి ఉంది. ఇటీవలే మీడియా తో ముచ్చటిస్తూ వీరు ఇరువురు తమ కి సినిమా పరిశ్రమ లో అభిమానం ఉన్న నటుల గురించి చెప్పుకొచ్చారు. ఈ సందర్భం లో శివాత్మిక కొన్ని ఆసక్తికర అంశాలని తెలిపింది.

శివాత్మిక మీడియా తో ముచ్చటిస్తూ, తనకి హిందీ లో రణ్వీర్ సింగ్, ఆదిత్య రాయ్ కపూర్, రన్బీర్ కపూర్, విక్కీ కౌశల్ అంటే ఇష్టం అని తెలిపింది. ఇక తెలుగు సినిమా పరిశ్రమ విషయానికి వస్తే, తెలుగు లో తనకి నాని అంటే ప్రేమ అని చెప్పింది. నిజానికి చాలా మంది నాని అంటే క్రష్ అంటారు కానీ ఈమెకి మాత్రం నాని మీద ఎనలేని ప్రేమ ఉందని తెలుస్తుంది. అంతే కాదు నాని నటన అంటే ఎంతో అభిమానం అంట. అలాగే జూనియర్ ఎన్టీఆర్ అంటే కూడా శివాత్మిక కి చాలా ఇష్టం అని తెలిపింది శివాత్మిక.

తను నటించిన దొరసాని ఈ నెల 12 న విడుదల అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -