Friday, May 17, 2024
- Advertisement -

‘దేవ‌దాస్’ సాంగ్ అదిరింది!

- Advertisement -

టాలీవుడ్ కింగ్ నాగ‌ర్జున ,న్యాచుర‌ల్ స్టార్ నాని క‌లిసి న‌టిస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘దేవదాస్’. ఇప్ప‌టికే విడుద‌లైన ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది.తాజాగా గురవారం నాడు ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. వాస్తవానికి నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా  (ఆగష్టు 29) ఈ ఫస్ట్ సింగిల్‌ని రిలీజ్ చేయాల్సి ఉండగా.. ప్రముఖ నటుడు నందమూరి హరిక్రిష్ణ మృతి కారణంగా సాంగ్‌ను వాయిదా వేశారు.   

హరికృష్ణ అంత్య క్రియలు మహా ప్రస్థానంలో ముగిసిన తరువాత ‘దేవదాస్’ ఫస్ట్ లిరిక్ సాంగ్‌ను విడుదల చేశారు. ‘వారు వీరు’ అంటూ సాగిన ఈ సాంగ్ వినసొంపుగా ఉంది. ఈ సినిమాకు మెలోడీ మాంత్రికుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -