Saturday, April 27, 2024
- Advertisement -

దసరాకు దేవర..రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం దేవర. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈచిత్రం ఫస్ట్ పార్ట్ తొలుత ఏప్రిల్‌లో విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ తాజాగా కొత్త రిలీజ్ డేట్ ఖరారైంది.

దసరాకి ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది.ఈ పోస్టర్ చూస్తుంటే యాక్షన్ సీక్వెన్స్ హై లెవెల్లో ఉండబోతోన్నాయని తెలుస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దేవర రిలీజ్ కానుంది.

ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్ చాకో, నరైన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2025 లో పార్ట్ 2 ను రిలీజ్ చేసేలా చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోందట. ఆచార్య బిగ్గెస్ట్ డిజాస్టర్ కావడంతో దేవర విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తున్నారు ఎన్టీఆర్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -