Tuesday, May 21, 2024
- Advertisement -

దేవి శ్రీ ప్రసాద్ హడావిడి అయిపోయింది

- Advertisement -

ఎన్నో అంచనాలు, ఎలాగైనా కొట్టేయాలనే కసితో వచ్చిన చిత్రం… దేవి శ్రీ ప్రసాద్. ఒక కొరియన్ మూవిని స్పూర్తిగా తీసుకుని రాసుకున్న కథతో దర్శకుడు శ్రీ కిషోర్ ఈ కథను తెరకెక్కించాడు. యాక్టర్స్ పరంగా సినిమా మొత్తం స్ట్రెచర్ మీద ఉండే పాత్రలో పూజా జీవించేసిందని చెప్పాలి. ఈ సినిమాకు అమ్మడే అసలు హై లైట్. కాని వేరియేషన్స్ ఇవ్వడానికి స్కోప్ తక్కువగా ఉండటం వల్ల అంత ఎక్స్ ప్లోర్ కాలేకపోయింది. శవంతో సెక్స్ చేసే ఇన్ టెన్షన్ తో సినిమా నడుస్తుంది . క్లైమాక్స్ లో మంచి రివీల్ ఇచ్చి.. మూవీని బతికించేశారు.

ఈ సినిమాలో ధనరాజ్ ఏదో హడావిడి చేసాడు కాని..అంతగా వర్కవుట్ అయిన దాఖలాలు లేవు. తొలిపరిచయం నుంచ హీరోగా ట్రై చేసి…పదిహేనేళ్లు గడుస్తున్నా…ఇప్పటికీ నటుడిగా వర్కవుట్ కాని భూపాల్ ..ఈసినిమాలో కాస్త ఉపయోగపడే డ్రైవర్ పాత్ర చేశాడు. మనోజ్ నందం రోల్ కూడా అంతంత మాత్రమే. సినిమా ప్రమోషన్ విషయంలో పడిన కష్టం..నిజంగా సినిమా కధ,కథనంలో పెట్టినట్లయితే గనుక సినిమా మరో స్థాయికి వెళ్లేదే. ఫస్టాఫ్ వరకు ఓకే అనిపించుకున్న దేవి శ్రీ ప్రసాద్ …తమిళ నేటివిటీకి సెట్ అయ్యే చిత్రం. కాని మనవాళ్లు దీనిని రిసీవ్ చేసుకునే స్థితిలో లేరు. అందుకే ఈ సినిమా కోసం పడిన కష్టం వేస్ట్ అయిపోయిందా అనిపిస్తుంది. మొత్తానికి దేవి శ్రీ ప్రసాద్ చిత్రం.. హడావిడి మార్నింగ్ ,మ్యాట్నీలతోనే కొండెక్కేసిందనే రూమర్లు వస్తున్నాయి.

https://www.youtube.com/watch?v=tn66yOluSk8

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -