Tuesday, May 14, 2024
- Advertisement -

రకుల్లో ఉన్నదేంటి…? రెజీనాలో లేనిదేంటి..?

- Advertisement -

అవ్వడానికి ర‌కుల్ ,రెజీనాలిద్దరూ….. హాట్ బ్యూటీలే. కాకపోతే ఒకరిని లక్, మరొకరని బ్యాడ్ లక్ వెంటాడుతున్నాయి. పర్ఫార్మెన్స్ పరంగా ఎలా ఉన్నా….. సాలిడ్ ఫిగర్ పేరుతో అవకాశాలు కొల్లగొట్టేస్తోన్నఈ ఇద్దరు…. ఇపుడు నువ్వా నేనా అనే సంగతి తేల్చుకునే పనిలో పడ్డారు.

నీలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి అంటూ ఒకరికొకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు.టాప్ హీరోల‌తో ర‌కుల్ సినిమాల మీద సినిమాలు చేసేస్తుంటే .. బి గ్రేడ్ హీరోల‌తో పాటు అపుడ‌పుడు టాప్ హీరోల‌తోను రెజీనా చిత్రాలు చేస్తూ వ‌స్తోంది.రెజీనాకొచ్చే ఆ ఆఫ‌ర్ ను కూడా….. తానే కొట్టేయాల‌ని ర‌కుల్ చూస్తుంటే…. ర‌కుల్ కొచ్చే ఒక్క పెద్ద ఆఫ‌ర్ అయినా త‌న‌కు రాకుండా పోతుందా…..నేనేంటో చూపించ‌కుండా ఉంటానా అని రెజీనా అంటోంది.ఫామ్ లో ఉన్నప్పుడు కాజ‌ల్ ,స‌మంతా,త‌మ‌న్నాలు కూడా ఇలాంటి ప‌రిస్థితిని ఫేస్ చేయ‌లేదు.

అన్నట్లు ఇంకో విష‌యం…… ర‌కుల్ కు లౌక్యంతో గోపీచంద్ ద్వారా హిట్ వ‌చ్చిన‌ట్లే…..ఇపుడు రెజీనాకు కూడా గోపీచంద్ చిత్రంలో అవ‌కాశ‌మొచ్చింది. ఏమో గుర్రమో కాదు…. రెజీనాకు కూడా గోపీతో ఒక్క హిట్ కొట్టి ర‌కుల్ పై ఎగిరినా ఎగ‌ర‌వ‌చ్చేమో. చూద్దాం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -