Saturday, May 4, 2024
- Advertisement -

తగ్గుతూనే ఉన్నాయి…నిన్న రెడ్ మి 4G … నేడు నెక్సస్ 6

- Advertisement -

మొన్నటి వరకూ…. తగ్గే ప్రసక్తి లేదని భీష్మించుకు కూర్చున్న స్మార్ట్ ఫోన్ కంపెనీలు…. ఒక్కొక్కటి తగ్గుముఖం పట్టాయి.నిన్న జియోమి రెడ్ మి ఎలాగైతే రెండు వేలు తగ్గించుకుని తన అమ్మకాలను పెంచుకుందో…అదే రీతిలో గూగుల్ సాయంతో మోటరోలా నెక్సస్ కూడా తన రేంజ్ తగ్గించుకుంది.తగ్గించుకోవడమంటే అలా ఇలా తగ్గించుకోవడం కాదు.ఏకంగా 10వేలు తక్కువ చేసి మరీ తన రేటు తగ్గించుకోవడంతో..

వినియోగ దారుల దృష్టి ఒక్కసారిగా గూగుల్ నెక్సస్ పై పడింది. వివరాల్లోకి వెళితే…గూగుల్ సహకారంతో మోటరోలా అందిస్తోన్న సెక్సస్ ౬ స్మార్ట్ ఫోన్…. గతంలో మార్కెట్లోకి 32జిబి సామర్ధ్యంతో 44,999/- రూపాయలకు అందుబాటులోకి వచ్చింది.అలాగే 64జిబిని 49,999/- గా డిసైడ్ చేసింది.కాని ఇపుడు 32 జిబి సామర్ద్యం గల ఫోన్ ను ఆ సంస్థ కేవలం 34 వేలకు,64జిబిని 39,999/- లకు అందివ్వబోతోంది.దీంతో గాడ్జెట్ దునియా…. ఒక్కసారిగా షేక్ అయినంత పని అయింది.నిజానికి ఏ స్మార్ట్ ఫోన్ విషయంలోనూ ఏ సంస్థ ఇంత తక్కువ చేసి అమ్మకాలను సాగించదు.ఇదిలా ఉంటే ప్రముఖ ఈ- కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ నెక్సస్ కు మార్కెట్లో ఉన్న రేటుకు ఇంకో 5 వేలు తగ్గించి జస్ట్ 29,999/- కే అందించేస్తూ ఉండడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.అసలు ఎందుకు సంస్థ ఇంతలా రేట్లు తగ్గించుకుని మరీ…. తమ వద్దనున్న మాల్ ను ఇలా చీప్ రేటుకు అమ్మేస్తుందా నని మార్కెట్ వర్గాలు ఆలోచన చేస్తున్నాయి.6 ఇంచ్ స్క్రీన్ డిస్ ప్లే తో ఆండ్రాయిడ్ 5.0 అకా లాలీపాప్ మీద ఈ నెక్సస్ ౬ రన్ అవుతుంది.3 జిబి ర్యామ్ ఇందుల్లో మనకు లభిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -