Friday, March 29, 2024
- Advertisement -

దగ్గుబాటి బ్రదర్స్ మధ్య ఆస్తుల గొడవలు..?!

- Advertisement -

హీరో విక్టరీ వెంకటేష్ , నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుల మద్య విభేదాలు తీవ్రతరం అయ్యాయని వార్తలు వస్తున్నాయి.

ఇండస్ట్రీలో ప్రముఖ ఫ్యామిలీగా చెలామణి అవుతున్న వీళ్ల మధ్య కూడా విబేధాలు తప్పడం లేదని టాక్. ప్రత్యేకించి ఆస్తుల వ్యవహారంలో వీరి మధ్య తేడాలు వచ్చాయని సమాచారం. ఇటీవలే దగ్గుబాటి రామానాయుడు మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అన్నదమ్ముల మధ్య విభేదాలు మొదలయ్యాయని.. ఇప్పుడు అవి తీవ్రస్థాయికి చేరాయని ఇండస్ట్రీ నుంచి రూమర్లు వినిపిస్తున్నాయి. వీటికి ఉన్న విశ్వసనీయత ఎంతో తెలియదు కానీ… ఇండస్ట్రీలో ఒక ప్రముఖ హీరోకి, ఆయన అన్నకు మధ్య ఆస్తుల వివాదం అంటే.. అది జనాల్లో ఆసక్తిని రేకెత్తించే అంశమే.

ఈ రూమర్ల సారాంశం ప్రకారం… అన్నయ్య తీరు పట్ల దగ్గుబాటి వెంకటేష్ బాబు చాలా అసంతృప్తి గా ఉన్నాడని తెలుస్తోంది. మరి ఇంతకన్నా ఈ వ్యవహారంల లోతుపాతుల గురించి వివరాలు తెలియడం లేదు. సురేష్ బాబు తీరుపై వెంకటేష్ అసంతృప్తిగా ఉన్నాడని మాత్రం అంటున్నారు. ఈ విబేధాలతోనే ఒక సినిమా కూడా ఆగిపోయిందని చెబుతున్నారు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఒక సినిమా రూపొందవలసి ఉంది. దానికి సురేష్ బాబు నిర్మాత. అయితే అన్నదమ్ముల మధ్య విబేధాలతో ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయిందని కూడా అంటున్నారు. మరి అసలు కథ ఏమిటో.. దగ్గుబాటి ఫ్యామిలీకే తెలియాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -