Friday, May 17, 2024
- Advertisement -

చిన్నారి అతిధి కోసం ఫేస్ బుక్ పేజీ

- Advertisement -

వైజాగ్ లో ట్యూషన్ కి వెళ్లి ఇంటికి తిరిగి వస్తూ తప్పిపోయి వరద నీటిలో కొట్టుకుపోయిన చిన్నారి అతిధి కోసం వెతకని చోటు లేదు వెతకని విధానం లేదు.

కారు ఎక్కుతున్న క్రమం లో వరద నీటిలో కాలు జారు కొట్టుకుపోయింది అని చెబుతున్నారు అతిధి గురించి. అయితే జీ వీ ఏం సి అధికారులు అప్పటి కప్పుడు సరిగ్గా స్పందించి ఉంటె ఆమె వెంటనే దొరికేది అని తల్లితండ్రుల వాదన.

నావికాదళ సిబ్బంది నాలుగు రోజులుగా సముద్రం నుంచీ డ్రైన్ లు అన్నీ కలయ తిరిగి చూసినా ఆమె కి సంబంధించి ఎలాంటి ఆచూకీ కనపడలేదు. బాలిక కి చెందిన స్కూలు బ్యాగ్ కానీ, దుస్తులు కానీ కనపడక పోవడం తో పోలీసులు వివిధ కోణాల్లో తమ పరిశోధన సాగిస్తున్నారు. ‘ఫైండింగ్ అదితి” అంటూ ఫేస్ బుక్ లో ఇప్పుడు ఒక పేజీ ని కూడా ఓపెన్ చేసి దాంట్లో ఆమె కి సంబంధించిన సమాచారం పెడుతునారు. 

9652255533 , 8498870308 ఈ నెంబర్ లకు ఆమె కి సంబంధించిన ఏదైనా విశేషం తెలిస్తే సమాచారం ఇవ్వాల్సింది గా కోరుతున్నారు. తగిన పారితోషికం కూడా ఇస్తాం అని ఇప్పటికే ప్రకటించారు .

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -