Thursday, May 16, 2024
- Advertisement -

అల్లూ అర్జున్ దగ్గర కాపీ కొడుతున్న వరుణ్ తేజ్ ?

- Advertisement -

సుకుమార్ – అల్లూ అర్జున్ ఇప్పుడంటే వారు పెద్ద డైరెక్టర్ పెద్ద హీరో కానీ వారిద్దరూ కలిసి చేసిన మొదటి సినిమా ఆర్య ఇప్పటికే పెద్ద సెన్సేషన్. అప్పట్లో ఆ సినిమా చూసి కుర్రకారు మొత్తం ‘ఫీల్ మై లవ్’ అంటూ రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన దిల్ రాజు తానే స్వయంగా ‘ఫీల్ మై లవ్ ‘ అనే టాగ్ లైన్ ని సినిమాగా తీస్తున్నాడు. 

ఫిలిం ఛాంబర్ లో ఈ టైటిల్ రిజిస్టర్ చేయించడం ఆసక్తిగా మారింది.  సుకుమార్ దర్శకత్వంలో  దేవిశ్రీప్రసాద్ నటించనున్న సినిమాకోసమే  ఆ టైటిల్ని ఫిక్స్ చేశారని అందుకే దాన్ని రిజిస్టర్ చేయించారని కొందరు కాదు… కాదు… వేరే సినిమా కోసం ఆ పేరు రిజిస్టర్ చేయించారని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. కానీ మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మెగా హీరో కోసం అట.

 వరుణ్ తేజ్ ని హీరోగా పెట్టి సినిమా తీసే ఆలోచనలో ఉన్న దిల్ రాజు ఈ లవ్ స్టొరీ కోసం ఈ టైటిల్ రిజిస్టర్ చేయించాడు అంటున్నారు. ఈ సినిమా కి డైరెక్టర్ గా కొత్త కుర్రాడు  వెంకీ అట్లూరి ని అనుకొంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -