Saturday, April 27, 2024
- Advertisement -

విశ్వంభర కోసం మరో దర్శకుడు?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి- వశిష్ట దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం విశ్వంభర. చిరు సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా 2025 జనవరి 10న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విశ్వంభర కోసం 13 మ్యాసీవ్ సెట్‌లను నిర్మించగా గతంలో చిరుతో కలిసి నటించింది త్రిష. విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా తాజాగా ఓ ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. సంక్రాంతికి నాగార్జునకు నా సామిరంగతో హిట్ ఇచ్చిన విజయ్ బిన్నీ విశ్వంభరలో జాయిన్ కానున్నారు.

దర్శకుడిగా కంటే ముందు బిన్ని ఓ డాన్స్ మాస్టర్‌. అందుకే విశ్వంభర సినిమాలో ఓ సాంగ్‌కి కొరియోగ్రఫీ చేయనున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని బిన్ని స్వయంగా వెల్లడించారు. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -