Saturday, April 27, 2024
- Advertisement -

బాబు రెడీ..బాలయ్య గురించేనా?

- Advertisement -

హనుమాన్ సినిమాతో సెన్సేషన్ సృష్టించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. పాన్ ఇండియా లెవల్లో సినిమా అందరిని ఆకట్టుకోగా ఈ సినిమాకు సీక్వెల్‌ను కూడా ప్రకటించారు ప్రశాంత్. అయితే తాజాగా సోషల్ మీడియాలో ప్రశాంత్ వర్మ చేసిన పోస్ట్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం బాలయ్య – బాబీ కాంబోలో NBK109 రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య – ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో ఆహా ఓటీటీ వేదికగా వచ్చిన అన్‌స్టాపబుల్ షో ఎంత ప్రజాదరణ పొందిందో చెప్పనక్కర్లేదు. మంచి రేటింగ్స్‌తో అన్‌స్టాపబుల్ దూసుకుపోగా ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా వేదికగా ‘మళ్ళీ తన హ్యాపీ ప్లేస్ లోకి వచ్చాను, బాబు రెడీ బాబు’ అంటూ పోస్ట్ చేసాడు. దీంతో ప్రశాంత్ అన్‌స్టాపబుల్ షోలో జాయిన్ అవుతున్నారా, లేదా జై హనుమాన్ షూట్‌లో జాయిన్ అయ్యారా అన్నది సస్పెన్స్‌గా మారింది.

ఇక బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న 109వ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ మహాశివరాత్రికి విడుదల కాగా ఒక్క గ్లింప్స్‌తోనే భారీ అంచనాలను పెంచేశాడు బాబీ. ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా?, సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్ అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌లు అందరిని ఆకట్టుకున్నాయి.ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -