దాసరి నారాయణరావు.. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా ఎన్నో సినిమాలు చేశారు. తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో తెలుగు సినిమాపై ‘దర్శకరత్న’గా ఆయన చెరగని ముద్రవేశారు. ఎందరో దర్శకులకు పాఠాలు చెప్పిన ఆయన.. తనదైన నటనతో వెండితెర అభిమానులను మురిపించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన పార్లమెంటు దాకా ఎదిగిన.. ఆయన సినీ ప్రస్థానంలో కొన్ని మైలురాళ్లు.. పాలకొల్లులో సామాన్యమైన కుటుంబంలో పుట్టిన దాసరి.. ఇంట్లో మూడోవాడు.
{loadmodule mod_custom,Side Ad 1}
దాసరి నారయణ రావు తండ్రి.. వాళ్ల పెద్దనాన్న కలిసి పొగాకు వ్యాపారం చేశారు. పొగాకు పెద్దగా వర్కవట్ కావడంతో.. ఆ కుటుంబం ఆర్థికంగా దెబ్బతింది. ఆ టైంలో వాళ్లకున్న పోలాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాసరిని స్కూల్ కి పంపించిన వాళ్ల నాన్న.. పొగాకు వ్యాపారం దెబ్బ కొట్టడంతో.. మధ్యలోనే చదువు మాన్పించేశారు. ఆరో తరగతిలో ఉన్నప్పుడే దాసరిని వడ్రంగి దుకాణంలో పనికి వెళ్లాడు. నెలకు రూపాయి జీతంగా కొంతకాలం పని చేసిన దాసరి.. ఆ తర్వాత ఓ మాస్టర్ సహకారంతో మళ్లీ చదువును కొనసాగించారు. అలా డిగ్రీ వరకు చదివారు. డిగ్రీలో ఉన్నప్పుడే నాటకాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన.. చిన్న చిన్న నాటకలు చేసి అందరిని ఆకట్టుకున్నారు. ఆ ఆసక్తితోనే.. సినీ పరిశ్రమకు వచ్చారు.
{loadmodule mod_custom,Side Ad 2}
అప్పట్లో పెద్ద నిర్మాత అయిన రాఘవగారు నిర్మించిన “తాత-మనవడు” సినిమాతో డైరెక్టర్ గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. సినీ రంగంలోకి వచ్చిన ఆయన.. అతి తక్కువ కాలంలోనే కీర్తిప్రతిష్ఠలు అందుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్రనటులతో సినిమాలు తీసి జాతీయ స్థాయి పురస్కారాలు కూడా అందుకున్నారు. ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన ఎన్నో చిత్రాలకు దాసరి దర్శకత్వం వహించారు. ‘తాత మనవడు’ చిత్రంతో దర్శకుడిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 150 కిపైగా చిత్రాలను ఆయన తెరకెక్కించారు. అలాగే నిర్మాతగా 53 చిత్రాలను నిర్మించారు. 250 కిపైగా చిత్రాలకు మాటలు, పాటలు అందించారు. ‘మామగారు’, ‘సూరిగాడు’, ‘అమ్మ రాజీనామా’, ‘ఒసేయ్ రాములమ్మ’, ‘మేస్త్రీ’, ‘ఎర్రబస్సు’ లాంటి చిత్రాల్లో నటించిన దాసరి తన నటకౌశలాన్ని బయపెట్టారు.
{loadmodule mod_custom,Side Ad 1}
రెండు జాతీయ పురస్కారాలు, తొమ్మిది నంది పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకున్న దాసరి… తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించి ఉత్తమ నటుడిగా పేరు తెచుకున్నారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో దాసరి చోటు దక్కించుకున్నారు. నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయితగా… 24 విభాగాలపై తనదైన శైలిలో పనిచేసి కళాకారుల ఉనికి కోసం పరితపించే దాసరి… చిత్ర సీమలో ‘దర్శకరత్న’గా ఎదిగారు. ఇలా ఎంతో మంది శిష్యులను తయారు చేసుకున్న దాసరి నారాయణరావు… పరిశ్రమ “గురువు”గా గుర్తింపు తెచ్చుకున్నారు.
{youtube}lTc3vBhwUN8{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
