Friday, March 29, 2024
- Advertisement -

హాఫ్ బిలియన్ కొట్టేసిన నాని ..

- Advertisement -

ఇండియా లోని తెలుగు రాష్ట్రాల కంటే యూ ఎస్ లో కలక్షన్ ల విషయంలో మన వాళ్ళు చాలా సీరియస్ గా ఉంటున్నారు ఈ మధ్యన. ప్రస్తుతం కృష్ణ గాడి వీర ప్రేమ గాథ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో మొదటి రోజు నుంచీ నడిచింది.

నానీ హీరోగా ఈ సినిమా ప్రకటించిన దగ్గర నుంచీ ఆసక్తికరంగా మారింది పరిస్థితి. దానికి తోడు ట్రైలర్ లూ , పోస్టర్ లూ , పాటలూ కూడా అదిరిపోవడం తో కృష్ణ గాడి వీర ప్రేమ గాథ కి కలక్షన్ ల వర్షం కురుస్తోంది ప్రస్తుతం.తెలుగు సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చే ఏరియా గా పేరున్న నైజాంలో వచ్చిన నాలుగురోజుల కలెక్షన్స్ కన్నా యూఎస్ లో వచ్చిన కలెక్షన్స్ ఎక్కువగా ఉండటం యూఎస్ లో నాని కున్న క్రేజ్ ని తెలియచేసింది.

సోమవారం తో కలిపి మొత్తం 3.54 కోట్ల రూపాయలు ($ 516,836) కలెక్ట్ చేసి యూఎస్ లో హాఫ్ మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. ఈగ, భలే భలే మగాడివోయ్ తర్వాత యూఎస్ లో ఈ మార్క్ దాటిన నాని మూడో సినిమా గా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ రికార్డును సృష్టించింది. దగ్గర లో మరే పెద్ద సినిమా రిలీజ్ లేకపోవడంతో రానున్న రోజుల్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -