దర్శకధీరుడు రాజమౌళికి సినిమాలు తప్ప మరో లోకం తెలియదు. రాజమౌళి సినిమాలు గురించి కాకుండా వేరే వాటి గురించి ఎప్పుడు స్పందించలేదు. తాజాగా ఆయన రాజకీయాల గురించి స్పందించారు. ఒక మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన పలు విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..మొదట రాజకీయ నాయకులపై నాకు తప్పుడు అభిప్రాయం ఉండేది. నాయకులు ఎందుకు మంచిగా ఉండరని అనుకునేవాడిని. అయితే ఆ తరువాత నేతలందరూ చెడ్డవారు కాదని తెలుసుకున్నా. కాని కొందరిని చూసిన తరువాత నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. ముఖ్యంగా లోక్‌సత్త అధినేత జయప్రకాష్ నారాయణతో కలిసి తిరిగినప్పుడు రాజకీయ నాయకులు ప్రజలు కోసం ఎంత కష్టపడుతున్నారో అర్థం అయిందని ,పొలిటీషియన్స్ అందరూ చెడ్డవారు కాదని తెలిపారు రాజమౌళి. రాజకీయ నాయకులు ఎంత బాధ్యతగా ఓటు వేస్తున్నారో ప్రజలు కూడా అంతే బాధ్యతగా ఓట్లు వేయాలని ఆయన కోరారు. ఇక RRR విషయానికి వస్తే సినిమా గురించి ఇప్పుడే స్పందించడం రైట్ టైమ్ కాదని అన్నారు. సినిమా గురించి పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తామని ప్రకటించారు.
- Advertisement -
రాజకీయ నాయకులపై సంచలన కామెంట్స్ చేసిన రాజమౌళి
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -