Monday, April 29, 2024
- Advertisement -

ఓటర్ల కాళ్ళు మొక్కితే ఓట్లు వేస్తారా ?

- Advertisement -

“ఇండియన్ పీపుల్స్ సెంటిమెంటల్ పీపుల్స్ ” ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఇది సినిమా డైలాగే అయినప్పటికి మనదేశ ప్రజలకు కరెక్ట్ గా సెట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటారా ? ఎన్నికల ముందు మన రాజకీయ నాయకులు ఎన్నో హామీలు ఇచ్చి అధికారం చేపడతారు తీరా అధికరంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చరు. తిరిగి ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ సెంటిమెంట్ వ్యాఖ్యలు చేస్తూ ప్రజా ఓట్లు దోచుకుంటూ ఉంటారు. తరచూ జరిగే ఒక సైకిల్ విధానం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు ఇచ్చే స్లోగన్స్ .. ప్రజల్లో బాగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి.

ఉదాహరణకు 2019 ఎన్నికల ముందు ఏపీలో వైసీపీ చేపట్టిన ” రావాలి జగన్ కావాలి జగన్ ” స్లో గన్ ప్రజల్లో ఏ రేంజ్ లో ఇంపాక్ట్ చూపించిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దాంతో ఎన్నికలు వచ్చే సమయానికి సరికొత్త స్లో గన్స్ తో ప్రజల్లోకి వెళుతుంటారు పోలిటికల్ లీడర్స్. ఇక తెలంగాణ విషయానికొస్తే ప్రస్తుతం టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో కూల్చేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నలే చేస్తోంది. అందులో భాగంగానే ప్రభుత్వ వ్యతిరేకత నిత్యం ప్రజల్లో ఉండే విధంగా ” సాలు దొర .. సెలవు దొర ” అనే స్లోగన్ తో బీజేపీ క్యాంపెన్ లో హోరెత్తిస్తోంది. దీంతో బీజేపీకి చెక్ పెట్టేందుకు టి‌ఆర్‌ఎస్ కూడా మోడీ టార్గెట్ గా ” సాలు మోడీ.. సంపకు మోడీ ” అనే స్లో గన్ తో ధరల పెరుగుదలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూపే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక ఉన్న నేపథ్యంలో ఈ క్రియేటివ్ క్యాంపెన్స్ బాగా పెరిగిపోయాయి.

టి‌ఆర్‌ఎస్, బీజేపీ లు ఇలా వినూత్న ప్రచారలతో దూసుకుపోతుంటే.. మరోవైపు కాంగ్రెస్ మరో సరికొత్త క్యాంపైన్ కూ శ్రీకారం చుట్టింది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టి‌ఆర్‌ఎస్ పార్టీలు రాజకీయ దుర్మార్గనికి పాల్పడుతున్నాయని వాటిని ఎదుర్కొనేందుకు ” ప్రజాస్వామ్యానికి పాదాభివందనం ” అనే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా లక్ష మంది ఓటర్లకు పాదాభివందనం చేసే విధంగా ఈ క్యాంపైన్ చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఒక్కో పార్టీ ఒక్కో విధంగా వినూత్న రీతిలో ప్రచారాలు సాగిస్తున్నాయి రాజకీయపార్టీలు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రజల కాళ్ళు మొక్కితే కాస్త సెంటిమెంట్ ఫలించి కొంత మేర ఓట్లు రాబట్టవచ్చు గాని, పూర్తి స్థాయిలో ప్రజలు సెంటిమెంట్ కూ లోనవుతారా అంటే చెప్పలేని పరిస్థితి. అలాగే ” సాలు దొర.. ” అని పిలుపునిచ్చినంత మాత్రాన టి‌ఆర్‌ఎస్ ను కాదని ప్రజలు బీజేపీ వైపు తిరిగేంతా మూర్ఖులా?. అలాగే ” సాలు మోడీ.. ” అని టి‌ఆర్‌ఎస్ అన్నంత మాత్రాన మోడీ పరిపాలనపై ప్రజలు ఆలోచిందడం మానేస్తారా ? అంటే వీటన్నిటికి స్పష్టమైన సమాధానాలు చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎన్ని విధాలా ప్రచారాలు చేసిన ప్రజలు వారి అవగాహన మేరకు మాత్రమే ఓట్లు వేస్తారనేది ఎవరు కాదనలేని వాస్తవం.

Also Read: లెఫ్ట్ ఓటర్లకు బీజేపీ గాలం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -