Monday, May 6, 2024
- Advertisement -

టాలీవుడ్ ని ఏలేస్తున్న ఈ కుర్రాడో ఎవరో తెలుసా?

- Advertisement -

టాలీవుడ్ లో ఎంతో మంది దర్శకులు వచ్చారు.. తమ సత్తా చాటుకుంటున్నారు. నూనూగు మీసాల పిల్లోడే టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసాడు. గుర్తు పట్టారా.. మీరు ఊహించిన పేరు నిజమే.. అతడెవరో కాదు లెక్కల మాస్టారు సుకుమార్. తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత సుకుమార్ గురించి తెలియని వారు ఉండరు. దర్శకుడు కాక ముందు గణితం అధ్యాపకుడిగా కెరీర్ కొనసాగించిన సుకుమార్ 2004లో ఇతని మొదటి చిత్రం అల్లు అర్జున్ తో ఆర్య సంచలన విజయం సాధించి అల్లు అర్జున్ను స్టార్ గా నిలబెట్టారు.

రెండవ చిత్రం హీరో రామ్ పోతినేని తోజగడం టేకింగ్ పరంగా వైవిధ్యం చూపి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. 100% లవ్ అక్కినేని నాగ చైతన్య సరి కొత్త కథతో యూత్ ని బాగా ఆకట్టుకొని మంచి విజయాన్ని నమోదు చేసింది. అందులోని పాటలు ప్రజాదరణ పొందాయి.2014 లో మహేష్ బాబు తో 1 – నేనొక్కడినే చిత్రాన్ని తీశారు. అది ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. 2016 లో జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన నాన్నకు ప్రేమతో సినిమా తో మంచి విజయాన్ని అందుకున్నారు.

అప్పుడెప్పుడో ఓసారి రాజమౌళి చెప్పాడు.. సుకుమార్ కానీ మాస్ సినిమా చేస్తే మేమంతా తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే అని. అన్నట్లుగానే 2018 లో రంగస్థలంతో రికార్డులు తిరగరాసాడు. ఇప్పుడు పుష్పతో మరోసారి మాస్ సినిమానే చేస్తున్నాడు. టాలీవుడ్‌లో దూసుకుపోతున్న సుకుమార్ అప్పట్లో తన స్నేహితుడితో సరదాగా దిగిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -