Sunday, May 4, 2025
- Advertisement -

తదుపరి సినిమా మీద దృష్టి పెట్టిన తేజ

- Advertisement -

‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా తో దర్శకుడు తేజ మంచి హిట్ నమోదు చేసుకున్నప్పటికీ తాజాగా తేజ దర్శకత్వం వహించిన ‘సీత’ సినిమా అనుకున్నంత మంచి విజయాన్ని సాధించలేకపోయింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గానే నిలిచింది. ఈ సినిమా ఇంకా కొన్ని థియేటర్లలో అడపాదడపా కలెక్షన్లు నమోదు చేసుకుంటూనే ఉంది కానీ దర్శకుడు తేజ అప్పుడే తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టడం మొదలు పెట్టారని సమాచారం.

తేజ అప్పుడే తన తదుపరి సినిమా కోసం స్క్రిప్ట్ ప్రిపేర్ చేసే పనిలో పడ్డాడట. తాజా సమాచారం ప్రకారం తేజ ఈసారి ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో టాలీవుడ్ లో కొత్త కంటెంట్ నీ తీసుకువచ్చేందుకు ఇది సరైన సమయం అని చాలా సార్లు చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే తన తదుపరి సినిమా కోసం కూడా తేజ ఒక విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాతోనైనా తేజ ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -