Monday, June 17, 2024
- Advertisement -

హీరోయిన్ల మధ్య అది సాధ్యమే!

- Advertisement -

అందాల చందమామ కాజల్. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా అనతికాలంలోనే గుర్తింపు తెచ్చుకుంది కాజల్. పెళ్లి తర్వాత కూడా తన కెరీర్‌లో వరుస సినిమాలతో అలరిస్తోంది కాజల్.

ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవడం అంత చిన్న విషయమేమి కాదు. ఒకసారి స్టార్ డమ్ వచ్చాక దానిని నిలబెట్టుకోవాలంటే చాల కష్టపడాలి. ముఖ్యంగా హీరోయిన్ల మధ్య కెరీర్ పరంగా చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఈ కాంపిటిషన్‌లో హీరోయిన్ల మధ్య ఫ్రెండ్ షిప్ ఉంటుందా అంటే ఆసక్తికర సమాధానం ఇచ్చారు కాజల్.

సినిమా ఇండస్ట్రీలో సమంత, తమన్న బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిపింది కాజల్. బృందావనం సినిమా నుండి తామిద్దరం ఫ్రెండ్స్‌గా మారామని అలాగే తమన్న,తాను ఇద్దరం ఒకేసారి కెరీర్‌ని ప్రారంభించామని చెప్పుకొచ్చింది. తమ బిజీ షెడ్యూల్స్ వద్ద పెద్దగా కలుసుకోవడం కుదరదని, ఒకవేళ ముగ్గురం కలిస్తే మాత్రం మామూలుగా ఉండదని వెల్లడించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -