Friday, March 29, 2024
- Advertisement -

రవితేజ పరిచయం చేసిన డైరెక్టర్లు..!

- Advertisement -




టాలీవుడ్ ఇండస్ట్రీలో.. మెగాస్టార్ చిరంజీవి తరువాత ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన వారిలో రవితేజ కూడా ఉంటాడు..! ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో లైట్ మెన్ గా అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. తరువాత కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించాడు రవితేజ. ‘కర్తవ్యం’ ‘అల్లరి ప్రియుడు’ ‘వారసుడు’ ‘నిన్నే పెళ్లాడతా’ ‘సముద్రం’ వంటి చిత్రాల్లో నటించిన రవితేజకు..దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ‘సింధూరం’ చిత్రం కాస్త ఇమేజ్ తెచ్చిపెట్టింది.

అయితే లైఫ్ ఇచ్చింది మాత్రం మన పూరి జగన్నాథ్ అనే చెప్పాలి. ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ ‘ఇడియట్’ వంటి చిత్రాలతో రవితేజ ను స్టార్ ను చేసాడు పూరి. ఆ చిత్రాల ద్వారా అతనిలో మాస్ యాంగిల్ ను బయటకు తీసాడు పూరి. ఆ తరువాత రవితేజకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కష్టపడి పైకొచ్చిన వ్యక్తి కాబట్టి.. ఆ కష్టం తెలుసుకుని.. అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరుగుతున్న ఎంతో మందికి డైరెక్టర్ ఛాన్స్ ఇప్పించాడు రవితేజ. అతను పరిచయం చేసిన శ్రీను వైట్ల, బోయపాటి శ్రీను, హరీష్ శంకర్.. వంటి వారు స్టార్ డైరెక్టర్లు గా ఎదిగారు. రవితేజ పరిచయం చేసిన డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

శ్రీను వైట్ల : నీకోసం
అగస్త్యన్ : ఈ అబ్బాయి చాలా మంచోడు
యోగి : ఒక రాజు ఒక రాణి
ఎస్.గోపాల్ రెడ్డి : నా ఆటోగ్రాఫ్.. స్వీట్ మెమోరీస్
బోయపాటి శ్రీను : భద్ర
హరీష్ శంకర్ : షాక్
సముద్ర ఖని : శంభో శివ శంభో
గోపీచంద్ మలినేని : డాన్ శీను
కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ : పవర్
విక్రమ్ సిరికొండ : టచ్ చేసి చూడు

Also Read: నటన వారిది… గాత్రం వీదిరి…!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -