Thursday, May 2, 2024
- Advertisement -

దేశంలో మరోసారి 40 వేలు దాటిన కరోనా కేసులు

- Advertisement -

దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 41,965 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి క‌రోనాతో మ‌రో 460 మంది మృతి చెందారు. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,28,10,845కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 4,39,020కి పెరిగింది.

అలాగే నిన్న క‌రోనా నుంచి 33,964 మంది కోలుకున్నారు. 3,78,181 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 65,41,13,508 డోసుల వ్యాక్సిన్లను వినియోగించారు. నిన్న ఒక్క రోజే 1,33,18,718 డోసుల వ్యాక్సిన్లను వినియోగించారు.

కేరళలో నో కంట్రోల్, థర్డ్ వేవ్ భయం
ఇదిలా ఉంటే మన దేశంలో అధిక కేసులు కేరళలో నమోదవుతున్నాయి. 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో 30,203 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదవుతున్న కేసులలో 2 వంతులకు పైగా కరోనా కేసులు ఒక కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్న తీరు ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది.

Also Read: రకరకల వ్యాధులతో బాధపడుతున్న నటీనటులు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -