Friday, May 3, 2024
- Advertisement -

ముద్దు ని ఫోకస్ చేయద్దు అంటున్న విజయ్

- Advertisement -

యువ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్ర లో త్వరలో రానున్న చిత్రం డియర్ కామ్రేడ్. ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఈ రోజే సినిమా గురించి మీడియా కి ఇంటర్వూస్ కూడా ఇచ్చాడు విజయ్. అయితే ఆయన ని ఈ మధ్య ఎక్కువగా అడుగుతున్న ప్రశ్న లిప్ లాక్స్ గురించి. ఇదే విషయమై విజయ్ మీడియా మీద కొంత అసహనం కూడా ప్రదర్శిస్తున్నాడు.

లిప్ లాక్ అనే పదాన్ని వాడటం విజయ్ కి కొంత ఇబ్బంది ని కలిగిస్తుంది అనేది మాత్రం అర్ధం అవుతుంది. “లిప్ లాక్ అని వాడటమే మంచిది కాదు. ముద్దు అనేది ఒక ఎమోషన్. ఒక ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ ని వ్యక్తపరిచే ఒక మంచి ఎమోషన్ అది. అన్ని ఎమోషన్స్ ని నేను సినిమాల్లో చూపించే లాగానే ప్రేమ ని కూడా ఆ విధం గా చూపిస్తూ ఉంటాను. దానిని పాయింట్ అవుట్ చేసి ఎక్కువ ఫోకస్ చేయడం మీడియా కి తగదు.” అని విజయ్ అన్నాడు.

డియర్ కామ్రేడ్ వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా లో రష్మిక హీరోయిన్ గా నటించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -