Monday, April 29, 2024
- Advertisement -

చ‌ర‌ణ్‌కి చెవుడు .. స‌మంతకి మూగ

- Advertisement -

అవునండీ రాంచ‌ర‌ణ్, స‌మంత జంటగా న‌టిస్తున్న ‘రంగస్థలంస‌లో వీర‌ద్ద‌రికి లోపాలు పెట్టాడు ద‌ర్శ‌కుడు సుకుమార్ . ‘రంగస్థలం’ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమా షూటింగ్ మొదలైన రోజుల్లోనే, ఇందులో చరణ్ వినికిడి లోపం కలిగిన యువకుడిగా కనిపించనున్నాడనే టాక్ బయటికి వచ్చింది. అదే నిజ‌మైంది. ఇప్పుడు సినిమా గురించి మ‌రోక వార్త హ‌ల్ చ‌ల్ చేస్తుంది.ఈ సినిమా లో హీరోయిన్‌గా న‌టిస్తున్న స‌మంత‌ మూగ అంటా! ఇదే వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.అంటే ఈ సినిమాలో స‌మంత‌కు మాట‌లు ఉండ‌వు. దీనిని స‌మంత ఫాన్స్ ఏలా రీసివ్ చేసుకుంటారో చూడాలి.ఇందులో నిజమెంత అనే విషయంలో నిన్నటివరకూ ఎలాంటి క్లారిటీ రాలేదు.

నిన్న విడుదలైన టీజర్ తో .. ఈ సినిమాలో చరణ్ పాత్రకి వినికిడి లోపం ఉందనే విషయం స్పష్టమైపోయింది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి సమంత పాత్రపై పడింది. చరణ్ పాత్ర విషయంలో బయటికి వచ్చిన వార్త నిజమైనట్టుగానే, సమంత మూగ అమ్మాయిగా కనిపించే విషయం కూడా నిజమైయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకుంటున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -