Tuesday, May 21, 2024
- Advertisement -

నిల‌క‌డ‌గా ఆడుతున్న సౌతాఫ్రికా…లంచ్ విరామ స‌మ‌యానికి దక్షిణాఫ్రికా 81/3‌

- Advertisement -

టీమిండియాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా నిల‌క‌డ‌గా ఆచితూచి ఆడుతోంది. రెండో రోజు ఆటలో భాగంగా గురువారం లంచ్‌ సమయానికి దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. 6/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికా.. లంచ్‌ సమయానికి మరో రెండు వికెట్లను కోల్పోయి 75 పరుగులు చేసింది. ఈ రోజు ఆటలో డీన్‌ ఎల్గర్‌(4) వికెట్‌ను తొందరగా తీసినా, రబడా(30)ను అవుట్‌ చేయడానికి టీమిండియా శ్రమించాల్సి వచ‍్చింది. మరో 106 పరుగులు చేస్తే ఆ జట్టు భారత తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 187ను అందుకుంటుంది.

జ‌ట్టులో నిలకడకు మారుపేరైన హషిమ్‌ ఆమ్లా (32; 52 బంతుల్లో 5×4) కుదురుకున్నాడు. ఇషాంత్‌ శర్మ వేసిన 30వ ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదేశాడు. భువి ధాటిగా బౌలింగ్‌ చేస్తున్న సహచరుల నుంచి అతడికి సహకారం లభించడం లేదు. అంతకు ముందే 16 పరుగుల వద్ద డీన్‌ ఎల్గర్‌ (4; 40 బంతుల్లో)ను భువినే ఔట్‌ చేశాడు.

లంచ్ విరామ స‌మ‌యానికి భార‌త్ మ‌రో వికెట్ ప‌డ‌గొట్టింది. నైట్‌వాచ్‌మన్‌ రబాడ (30; 84 బంతుల్లో 6×4) ఔటయ్యాడు. ఇషాంత్‌ శర్మ వేసిన 29.6వ బంతిని ఆడబోయి స్లిప్‌లో రహానె చేతికి చిక్కాడు. గాల్లో తలమీదుగా వెళ్తున్న బంతిని రహానె చక్కగా ఒడిసిపట్టాడు. భారత జట్టులో పేరున్న బ్యాట్స్‌మెన్‌ విఫలమైన ఈ పిచ్‌పై నైట్‌వాచ్‌మన్‌గా వచ్చి జట్టుకు విలువైన పరుగులు అందించిన పేసర్‌ రబాడకు అభిమానులు, సహచరులు నిలబడి చప్పట్లతో అభినందనలు తెలిపారు. లంచ్‌ సమయానికి ఆమ్లా(32 బ్యాటింగ్‌), డివిలియర్స్‌(0 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -