Wednesday, May 15, 2024
- Advertisement -

లైవ్‌లో క్లాస్ పీకిన ‘ఎన్టీఆర్’ హీరోయిన్‌

- Advertisement -

తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ ఇప్పుడిప్పుడే పెద్ద సినిమాల‌లో అవ‌కాశాలు ద‌క్కించుకుంటుంది.ఎన్టీఆర్ న‌టించిన అర‌వింద స‌మేత సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది ఈషా రెబ్బా.ఈ నటి వైవిధ్యమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ఈషా స్కిన్ కలర్ గురించి కామెంట్ చేశాడు. ‘ఈషాగారు మీరు కొంచెం కలర్ ఉంటే మీకు తిరుగు ఉండేది కాదు’ అని కామెంట్ చేశాడు.

దీనికి ఘాటు సమాధానమిచ్చింది ఈషా.ఎందుకు అండి ఈ కలర్ పిచ్చి. నాకు ఉన్న కలర్ తో నేను చాలా సంతోషంగా ఉన్నాను. హీరోలు ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ హీరోయిన్ మాత్రం తెల్లగా మన నేటివిటీకి సంబంధం లేకుండా ఉంటే మీకు ఇష్టమా..?’ అంటూ అతడికి క్లాస్ పీకింది. ఈషా చెప్పింది కూడా లాజిక్కే.. హీరోలు ఎలా ఉన్నా.. అభిమానులు ప్రశ్నించరు.. అదే హీరోయిన్ రంగు కాస్త తక్కువగా ఉంటే ఎత్తి పొడుస్తుంటారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -