Thursday, May 2, 2024
- Advertisement -

హీరోయిన్ మోజులో ప‌డి స‌ర్వం కోల్పోయిన ఇంజ‌నీరింగ్ విద్యార్థి

- Advertisement -

సినిమా హీరోయిన్ మోజులో ప‌డి త‌న స‌ర్వ‌స్వాన్ని కోల్పోయింది ఓ ఇంజ‌నీరింగ్ విద్యార్థిని. తాను ఒక సినిమా నిర్మాతనని, నువ్వు చాలా అందంగా ఉన్నావని మాయమాటలు న‌మ్మి మోస‌పోయింది. ఈ సంఘ‌ట‌న త‌మిళ‌నాడులో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన ప్ర‌కారం తిరుపోరూర్, పాత మహాబలిపురం ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని (25), గత నెల8వ తేదీన మరో ఊరు వెళ్లడానికి బస్టాండ్ లో నిలబడివుండగా, ఓ ఖరీదైన కారు వచ్చి ఆగింది. అందులో నుంచి దిగిన ఓ వ్యక్తి, తాను సినీ నిర్మాతనని ఆమెను పరిచయం చేసుకున్నాడు.

హీరోయిన్‌ కోసం వెతుకుతున్నానని చెప్పి.. హీరోయిన్‌గా నటిస్తారా? అని అడిగాడు. అందుకు ఆ యువతి ఒప్పుకుంది. అతను మాట్లాడదామని ఆ యువతిని కారులో మహాబలిపురానికి తీసుకెళ్లాడు. అక్కడే ఓ గదిని అద్దెకు తీసుకున్న ఆ వ్యక్తి, కథా చర్చలంటూ ఆమెను రంగంలోకి దించాడు. ఆమె కూడా అవకాశం కోసం అతనితో సన్నిహితంగా మెలిగింది. ఆపై అతను తిరిగి 17న కలుద్దామని, అప్పుడు కొంత డబ్బు తేవాలని కోరగా, ఆమె రూ. 60 వేలు తీసుకెళ్లి ఇచ్చింది. కారులో కోవై వెళ్లిన వారు, మరో గదిని తీసుకుని ఏకాంతంగా గడిపారు.

అనంతరం ఆ వ్యక్తి 17వ తేదీన మళ్లీ కలుద్దామని, అప్పుడు డబ్బుతో రావాలని చెప్పాడు. అమె కూడా ఈ నెల 17న రూ.60 వేలు తీసుకుని అతన్ని కలిసింది. ఆమె రూ. 60 వేలు తీసుకెళ్లి ఇచ్చింది. కారులో కోవై వెళ్లిన వారు, మరో గదిని తీసుకుని ఏకాంతంగా గడిపారు. మరి, తన సినిమా చాన్స్ ఏమైందని ఆమె ప్రశ్నించగా, ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యాడా వ్యక్తి. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆమె, తన తల్లికి విషయం చెప్పి, పోలీసులను ఆశ్రయించింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు అత‌నికోసం గాలిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -