Monday, April 29, 2024
- Advertisement -

ఎలిమినేట‌ర్స్‌కు మ‌ళ్లీ అవ‌కాశం ఇస్తున్న బిగ్‌బాస్

- Advertisement -

భారీ అంచ‌నాల మ‌ధ్య మొద‌లైంది తెలుగు బిగ్‌బాస్.ఎవ‌రు ఊహించ‌ని విధాంగా ఎలిమినేట్ అవుతున్నారు షోలోనొ హోస్‌మెట్స్‌.‘బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ఏదైనా జరగొచ్చు’ అన్నట్లే ఊహించిన విధంగా ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తున్నాడు హోస్ట్‌ నాని. వైల్డ్‌ కార్డ్‌ ద్వారా హౌస్‌లోకి ఎవరైన కొత్తవారు వస్తారని అందరూ భావించారు.కాని షో నుండి ఎలిమినేట్ అయిన వారినే మ‌ళ్లీ తిరిగి బిగ్‌బాస్ హోస్‌లోకి తీసుకువ‌స్తున్నారు.ఇన్ని వారాలు మీ పేవరేట్ హౌస్‌ మేట్స్‌ను సేవ్‌ చేయడానికి ఓట్లేశారు.

కానీ ఈ వారం ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్‌లను మళ్లీ హౌస్‌లోకి పంపించడానికి ఓట్లేయబోతున్నారు.ఓటింగ్‌ లైన్స్‌ ఈ రోజు 11 గంటలకు ప్రారంభమవుతాయని బిగ్‌బాస్‌ ప్రకటించాడు. తీనికి సంబంధించిన ఓ ప్రోమోని విడుద‌ల చేశారు.ఇక తొలి వారం సంజనా, రెండో వారం నూతన నాయుడు, మూడో వారం కిరీటీ, నాలుగో వారం శ్యామల, ఐదో వారం భానుశ్రీ, ఆరోవారం తేజస్వీలు ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. మ‌రి వీరిలో ఎవ‌రు తిరిగి బిగ్‌బాస్ హోస్‌లోకి ఎవ‌రు వ‌స్తారో చూడాలి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -