‘క్షణం’, ‘గూడచారి’ వంటి సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న యువ హీరో అడవిశేష్ ఇప్పుడు వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో మరొక క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘ఎవరు’ అనే ఆసక్తికరమైన టైటిల్ తో విడుదల కాబోతున్న ఈ సినిమాలో రెజీనా కసాండ్రా నవీన్ చంద్ర మరియు మురళి శర్మ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచిన దర్శకనిర్మాతలు తాజాగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. కేవలం రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీజర్ లాగానే ట్రైలర్లో కూడా నవీన్ చంద్ర రెజీనా కసాండ్రా పై ని మానభంగం చేయడానికి ప్రయత్నిస్తుండగా రెజీనా నవీన్ ను చంపడంతో మొదలవుతుంది. ఆ వెంటనే ఆ మర్డర్ కేసు కరప్ట్ పోలీస్ ఆఫీసర్ అయిన విక్రమ్ వాసుదేవ్ (అడవిశేష్) చేతుల్లోకి వెళ్తుంది. ఈ కేసును అడవి శేష్ ఏ విధంగా సాల్వ్ చేసాడు? ఒక ముసలాయన మిస్సింగ్ కేస్ కి ఈ మర్డర్ కేస్ కి వెనుక గల సంబంధం ఏమిటి? అనేది ఈ సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. పీవీపీ సినిమా నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 15న విడుదలకు సిద్ధం అవుతోంది.