Sunday, May 5, 2024
- Advertisement -

తెలుగు టాప్ టెన్ సినిమాల‌లో ‘ఎఫ్ 2’

- Advertisement -

ఈ సంక్రాంతికి విడుద‌లై ఘ‌న విజ‌య‌సాధించింది ఎఫ్‌2 సినిమా. వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్‌లు హీరోలుగా న‌టించిన ఈ సినిమా సంక్రాంతి విజేత‌గా నిలిచింది. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో హీరోయిన్స్‌గా త‌మ‌న్నా,మెహ్రీన్‌లు న‌టించారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద త‌న స‌త్తాను చాటించి. సంక్రాంతికి విడుద‌లైన మిగిలిన సినిమాలు ఫెయిల్ కావ‌డం ఎఫ్ 2 సినిమాకు క‌లిసి వ‌చ్చింది.

బాక్స్ ఆఫీస్ వద్ద మూడో వారంలో కూడా కలెక్షన్స్ జోరు కొనసాగిస్తోంది. మూడోవారం చివరకు వస్తున్నా కలెక్షన్స్ లో పెద్దగా డ్రాప్ కనిపించడంలేదు. తాజాగా ఈ సినిమా తెలుగు టాప్ టెన్ సినిమాల‌లో చోటు సంపాదించింది. 20 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా 74.42 కోట్ల రూపాయిలు వ‌సూలు చేసిన‌ట్లు ట్రెండ్ పండితులు తెలిపారు. బాక్సాఫీస్ ఈ వారంలో కూడా పెద్ద‌గా సినిమాలు లేక‌పోవ‌డంతో ఈ క‌లెక్ష‌న్లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ అత్తారింటికి దారిది కలెక్షన్స్‌ను ఈ సినిమా క్రాస్ చేసే అవ‌కాశం కూడా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా 20 రోజుల ‘F2’ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం

నైజామ్: 21.16 cr
సీడెడ్: 7.95 cr
ఉత్తరాంధ్ర: 9.35 cr
కృష్ణ: 4.80 cr
గుంటూరు: 5.22 cr
ఈస్ట్ : 6.39 cr
వెస్ట్: 3.77 cr
నెల్లూరు: 1.78 cr
ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 60.42 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా: 5.10 cr
ఓవర్సీస్: 8.90 cr
వరల్డ్ వైడ్ టోటల్: రూ. 74.42 cr

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -